DC Vs KKR: ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ తర్వాత.. పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది కోల్ కతా జట్టు.. ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ లలో రెండూ గెలిచి సత్తా చాటింది. ఎటువంటి అంచనాలు లేకుండానే ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు అద్భుతమైన విజయాలు సాధిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఢిల్లీ జట్టుతో జరిగే మూడవ లీగ్ మ్యాచ్ కు సిద్ధమైంది. ఢిల్లీ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడి ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. వరుసగా రెండు లీగ్ మ్యాచ్ లు ఓడిన ఢిల్లీ జట్టు.. డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది.. దీంతో కోల్ కతా తో జరిగే పోరుకు సై అంటున్నది. ఈ క్రమంలో రెండు జట్ల బలాబలాలు ఒకసారి పరిశీలిస్తే..
ఢిల్లీ క్యాపిటల్స్
ఈ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చెన్నై బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలో ఢిల్లీ ఆటగాళ్లు అటు బౌలింగ్, బ్యాటింగ్ లో తమ బెస్ట్ ఇచ్చారు. రెండు మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ.. మూడో మ్యాచ్లో బలమైన చెన్నై జట్టును ఢిల్లీ ఓడించింది. ఏకంగా 20 పరుగుల తేడాతో చెన్నై పై జయ కేతనం ఎగరవేసింది. డేవిడ్ వార్నర్, పంత్ టచ్ లోకి వచ్చారు. స్టబ్స్, మార్ష్ కనుక నిలకడగా ఆడితే ఢిల్లీ జట్టును ఆపడం ఎవరి తరమూ కాదు. అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ బౌలింగ్లో అద్భుతాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్లాగ్ ఓవర్స్ లో ముఖేష్ వేస్తున్న బౌలింగ్ అద్భుతం.
కోల్ కతా
ఈ సీజన్ లో ఆడుతున్న పది జట్లల్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తున్న టీం ఏదైనా ఉందంటే.. అది కోల్ కతానే. సాల్ట్, నరైన్ రూపంలో ఆ జట్టుకు అద్భుతమైన ఆటగాళ్లు దొరికారు. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రస్సెల్ దూకుడుగా ఆడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ అయ్యర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్లో రస్సెల్, హర్షిత్ రానా అదరగొడుతున్నారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్ లో రస్సెల్ మిసైల్ లాగా బౌలింగ్ చేస్తున్నాడు. నరైన్ కూడా పంటితో అద్భుతాలు చేస్తున్నాడు.. స్టార్క్ మాత్రం విపరీతంగా పరుగులు ఇస్తున్నాడు.
అంచనా
ఈ రెండు జట్ల బలాబలాలు పరిశీలిస్తే..ఈ మ్యాచ్ లో కోల్ కతా గెలుపు సాధించేలా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ 32 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 16 మ్యాచ్ లలో కోల్ కతా విజయం సాధించింది. 15 మ్యాచ్ లను ఢిల్లీ గెలిచింది. కోల్ కతా జట్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే అడ్డుకోవడం ఢిల్లీకి తలకు మించిన పనే.
ఢిల్లీ
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పంత్, స్టబ్స్, పోరెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోకియా, ముఖేష్ కుమార్, కులదీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్.
కోల్ కతా
ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, నరైన్, రస్సెల్, రమణ్ దీప్ సింగ్, అనుకూల్ రాయ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.