Deepak Chahar : ఈసారి జరిగే వేలంలో దూకుడుగా ఆడే ఆటగాళ్లకు, అద్భుతమైన పంతులు భారీగా ధర దక్కుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో కొందరు ఆటగాళ్లు పాత జట్లకే ఆడాలని ఉవ్విళ్లురుతున్నారు. ఈ జాబితాలో మాజీ పేస్ బౌలర్ దీపక్ చాహార్ మందు వరుసలో ఉన్నాడు.. దీపక్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ఇతడు కుడిచేతి వాటం పేస్ బౌలర్. అయితే ఇతడు మెగా వేలం ముందు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈసారి కూడా చెన్నై జట్టు తనను కొనుగోలు చేస్తుందని దీపక్ చెబుతున్నాడు. ఆ విషయాన్ని అతడు ఘంటా పథంగా అంటున్నాడు. ” ఈసారి వేలం హోరాహోరీగా జరుగుతుంది. నా విషయానికి వస్తే చెన్నై జట్టు కొనుగోలు చేస్తుంది. గతంలో జరిగిన మెగా వేలంలోనూ నన్ను చెన్నై జట్టు కొనుగోలు చేసింది. భారీగానే ఖర్చు చేసింది. ఈసారి కూడా చెన్నై జట్టు నన్ను కొనుగోలు చేస్తుంది.. ఒకవేళ చెన్నై కొనుగోలు చేయకుంటే.. రాజస్థాన్ నాకోసం పోటీ పడుతుంది. ఇదే అంచనా నాకుంది.. అందువల్లే ఈసారి సీజన్లో నాకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నానని” దీపక్ పేర్కొన్నాడు.
పవర్ ప్లే లో వికెట్ల వీరుడు
దీపక్ కు ఐపీఎల్ లో పవర్ ప్లే లో వికెట్ల వీరుడుగా పేరు ఉంది. పసుపు రంగు జెర్సీతో అతడు ఆరు సీజన్లలో ఆడాడు. దీర్ఘమైన అనుభవం ఉన్న బౌలర్ గా పేరు గడించాడు. 2018 నుంచి అతడు చెన్నై జట్టుకు ఆడుతున్నాడు. ఇప్పటివరకు 76 వికెట్లు పడగొట్టాడు. 81 ఐపిఎల్ మ్యాచ్లు ఆడాడు. దీపక్ ది రాజస్థాన్ రాష్ట్రం. దేశవాళి క్రికెట్లో అద్భుతమైన ఆటగాడిగా పేరుపొందాడు. స్థిరమైన ప్రదర్శనతో ఐపీఎల్ లో ఆయా జట్ల యాజమాన్యాల దృష్టిలో పడ్డాడు. 2016లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభ ఏడాదిలో పూణే జట్టు దీపక్ ను పది లక్షలకు కొనుగోలు చేసింది. రెండు సీజన్ల అనంతరం చెన్నై జట్టు అతడిని 80 లక్షలకు సొంతం చేసుకుంది. ధోని నేతృత్వంలో అతడు రాటు తేలాడు. చెన్నై జట్టు సాధించిన విజయాలలో ముఖ్య భూమిక పోషించాడు. ఇక 2022 మినీ వేలంలో ఏకంగా 14 కోట్లకు చెన్నై జట్టు అతన్ని కొనుగోలు చేసింది. అయితే అతనికి 14 కోట్లు చెల్లించడం అప్పట్లో సంచలనంగా మారింది.. అయితే ఈసారి అతడిని అదే ధరకు చెన్నై జట్టు దక్కించుకుంటుందా? లేక రాజస్థాన్ జట్టు ఆ ధైర్యం చేస్తుందా? అనే ప్రశ్నలకు త్వరలో జరిగే మెగా వేలంలోనే సమాధానం లభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Deepak Chahar talks about his wishes for the IPL Mega Auction #Cricket #DeepakChahar #IPLAuction pic.twitter.com/Y0LiR8xFEv
— Sportskeeda (@Sportskeeda) November 12, 2024