డిజాస్టర్ వైపు అడుగులు వేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 గాడిలో పడింది మాత్రం వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాతనే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా రోహిణి, అవినాష్, టేస్టీ తేజ లేకుంటే ఈ సీజన్ పెద్ద ఫ్లాప్ అయ్యేది, ఎంటర్టైన్మెంట్ అసలు ఉండేది కాదు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా అనుకుంటున్నారు. ఈ ముగ్గురు మంచిగానే అనిపిస్తున్నారు కానీ, వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనే విషయం స్పష్టంగా ఆడియన్స్ కి అర్థమైపోయింది. నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీ లను ఆడియన్స్ K బ్యాచ్ అని పిలుస్తుండగా, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ టీం ని RAT అని పిలుస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం నామినేషన్స్ లోకి RAT టీం నుండి అవినాష్, టేస్టీ తేజా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరికీ మంచి ఓటింగ్ పడుతుంది, కచ్చితంగా సేవ్ అవుతారు కూడా.
కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఇంస్టాగ్రామ్ లో నామినేషన్స్ లో ఉన్నటువంటి టేస్టీ తేజ, అవినాష్ లకు ఓట్లు వేయాల్సిందిగా రోహిణి ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి స్టోరీ పడింది. దీనిని చూసి నెటిజెన్స్ ఏకిపారేశారు, ఇంత ఓపెన్ గా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఇది అన్యాయం అంటూ నిలదీశారు. సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకతను చూసి వెంటనే రోహిణి టీం ఇంస్టాగ్రామ్ స్టోరీలను తొలగించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఎంతసేపు నిఖిల్ బ్యాచ్ ని గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటూ జనాలకు చెప్పుకొచ్చే ఈ ముగ్గురు, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నిలదీస్తున్నారు. నామినేషన్స్ లో కూడా ఈ ముగ్గురు ఇదే పాయింట్ మీద నిఖిల్, యష్మీ , పృథ్వీ లతో వాదించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా తేజా ఈ వారం నామినేషన్స్ లో ఎంత ఓవర్ చేసాడో మనమంతా చూసాము.
ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న K బ్యాచ్ లో ప్రేరణ నిఖిల్, పృథ్వీ ని నామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, అదే విధంగా పృథ్వీ ప్రేరణ ని నామినేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. యష్మీ ఒక వారం ప్రేరణని నామినేట్ చేయాలనీ అనుకుంది. కానీ హౌస్ లోకి అడుగుపెట్టి ఆరు వారాలు కావొస్తున్నా కూడా, ఇప్పటి వరకు రోహిణి, అవినాష్, తేజ లలో ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్న సందర్భాలే లేవు. ఇంత స్పష్టంగా గ్రూప్ గేమ్ ఆడుతూ, మళ్ళీ అవతల వాళ్ళని గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని టార్గెట్ చేయడం ఎంత వరకు న్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ ముగ్గురిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ నెగటివిటీ ప్రభావం ప్రస్తుతానికి అయితే వీళ్ళ ఓటింగ్ మీద చూపించేంత పడలేదు కానీ, ఇదే విధంగా కొనసాగితే మాత్రం భవిష్యత్తులో ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు.