Homeజాతీయ వార్తలుCredit Card Cyber Crime : క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని కాల్స్, ఓటీపీ చెప్పారంటే...

Credit Card Cyber Crime : క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని కాల్స్, ఓటీపీ చెప్పారంటే మీ పని అంతే ?

Credit Card Cyber Crime : మీ క్రెడిట్ కార్డ్ ట్రాక్ చాలా బాగుంది. మేము క్రెడిట్ లిమిట్ పెంచాలని అనుకుంటున్నాం. మీ వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి అని కాల్ వస్తుంది. పేరు, బ్యాంకు, క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే లావాదేవీల వివరాలన్నీ మనం చెప్పకుండానే అనర్గళంగా చెబుతారు. చివరగా, ఈ నెలలో మీరు ఉపయోగించిన క్రెడిట్‌ను సకాలంలో తిరిగి చెల్లించమని సూచించి మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు అంటూ ముగిస్తారు. మరుసటి రోజు లేదా రెండు రోజుల తర్వాత, ట్రూకాలర్‌కు బ్యాంక్ నుండి మరొక కాల్ వస్తుంది. మీ క్రెడిట్ కార్డ్ రికవరీని వీలైనంత త్వరగా చెల్లించండి. ఎందుకంటే ఈ నెల నుంచి మీ క్రెడిట్ లిమిట్ పెరుగుతుందని బిల్డప్ ఇస్తారు. మీరు ఇంకా క్రెడిట్‌ కార్డు రికవరీ చెల్లించకపోతే త్వరగా చెల్లించాలి. లేకపోతే సిబిల్‌ స్కోర్‌ తగ్గి క్రెడిట్‌ కార్డు లిమిట్ పెరగదని హెచ్చరిస్తారు సైబర్ నేరగాళ్లు. ఒక వేళ రికవరీ చెల్లించినట్లయితే మీరు సకాలంలో రికవరీ చెల్లించినందుకు థ్యాంక్యూ అని చెబుతూ ప్రారంభిస్తారు. మీ క్రిడిట్‌ కార్డు రేంజ్‌ అదనంగా మరో 50 వేల రూపాయలు పెరుగుతుందని, దానికి మరికొన్ని డీటెయిల్స్‌ చెప్పాలని అడుగుతారు. ఇంతకీ గత నాలుగు రోజులుగా మనలను ఫాలోఅప్‌ చేస్తున్న వ్యక్తి అవ్వడంతో మనం వెంటనే నమ్మి అడిగిన అన్నింటికీ టకటకా సమాధానాలు చెబుతాం. చివరిగా మీ కార్డులో అమౌంట్‌ పెరిగేందుకు అయ్యేందుకు మీ మొబైల్‌కు ఒక మెసేజ్‌ వచ్చింది. ఆందులో నెంబర్‌ చెప్పాలని అడుగుతారు. అప్పటికే అన్ని వివరాలు చెబుతూ వచ్చిన మనం వెంటనే ఆ మెసేజ్‌లో ఉన్న నెంబర్‌ను టకాటకా చెప్తేస్తాం. అంతలోనే మన మొబైల్‌కు మరో మెసేజ్‌ వస్తుంది. ఇంకేముంది మన క్రెడిట్‌ కార్డులో ఉన్న 50 వేలు కట్ అయిపోతాయి. అంతలోనే మనతో అప్పటి వరకు చాలా హుందాగా మాట్లాడిన వ్యక్తి కూడా కాల్‌ కట్ చేసేస్తాడు. తిరిగి చేద్దామంటే మళ్లీ ఆ కాల్‌ కనెక్ట్‌ అవ్వదు. మెసేజ్ చూసుకోని మనం ఏడ్వడం తప్ప మనం ఏం చేయలేని పరిస్థితి. ఇలా కొత్త మార్గాల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారు.

ఇప్పుడు క్రెడిట్ కార్డుల ద్వారా సైబర్ కేటుగాళ్లు చేస్తున్న తాజా మోసం ఇదే. మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందని ఇంట్లో వాళ్లకు తెలియదు కానీ ఈ సైబర్ నేరగాళ్లకు మన అడ్రస్, ఆధార్ నంబర్ సహా క్రెడిట్ కార్డ్ వివరాలు తెలుసు. మన మొబైల్‌తో లింక్ చేయడానికి వారికి ఐదు అంకెల OTPఅవసరం. సైబర్ మోసగాళ్ల వలలో పడి ఓటీపీ చెబితే క్షణాల్లో మన క్రెడిట్ కార్డు నుంచి నగదు తగ్గిపోతుంది. ఇటీవలి రోజుల్లో ఈ తరహా మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల కాలంలో పీఎన్ బీ బ్యాంకు పేరుతో ఒక వ్యక్తి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచేందుకు సంబంధిత వివరాలు, కార్డు నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను అడిగారు. అనంతరం బాధితుడికి వాట్సాప్ ద్వారా ఒక ఏపీకే (APK) ఫైల్ పంపించారు. బాధితుడు ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే, అతని ఫోన్ మాల్వేర్ ద్వారా హ్యాక్ చేశారు. ఫలితంగా, బాధితుడు ఎటువంటి ఓటీపీని చెప్పకపోయినా అతని హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ నుండి రూ.55వేల రూపాయలు డెబిట్ అయ్యాయి.

బాధితుడు వెంటనే సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ యూనిట్, హైదరాబాద్ NCRP టీమ్ ఈ ఘటనపై చర్యలు తీసుకుని బాధితుడి మొబైల్ ఫోన్ నుండి మాల్వేర్‌ను క్లియర్ చేశారు. లావాదేవీలు మొబీక్విక్ ద్వారా జరిగినట్లు గుర్తించారు. సంబంధిత అధికారులకు నోటీసులు పంపించి, నిధులను బ్లాక్ చేయించారు. NCRP టీం తక్షణ చర్యలతో కోర్టు ఆదేశం లేకుండానే రూ.55వేలను బాధితుడి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌కు తిరిగి చెల్లించారు. ఈ సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ NCRP టీంను అభినందించారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి వివరాలు అడిగితే చెప్పవద్దని, అనుమానం ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా ఈ తరహా మోసాలు పెరుగుతున్నందున, బ్యాంకుల నుంచి వచ్చే కాల్స్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని స్పందించాలని, అలాంటి కాల్‌లను ప్రయత్నించవద్దని సూచించారు. ఆర్థిక నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. మోసానికి గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ లేదా cybercrime.gov.inలో ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version