గెలిపించి టీమిండియా హీరో అయిన ‘దీపక్ చాహర్’

  శ్రీలంకతో రెండో వన్డేలో భారత్ ఓడిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రధాన బ్యాట్స్ మెన్ అంతా విఫలమయ్యారు. 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఉన్నది ప్రధాన బౌలర్లు అయిన దీపక్ చాహర్, భువనేశ్వర్ లు. శ్రీలంక ఆటగాళ్లు అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు. ఇక టీమిండియా ఓటమి ఖాయం అనుకున్నారంతా.. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది.. టీమిండియా ప్రధాన బౌలర్ దీపక్ చాహర్ ఒక అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ గా మారిపోయాడు. సీనియర్ బ్యాటింగ్ చేసినట్టు […]

Written By: NARESH, Updated On : July 21, 2021 4:41 pm
Follow us on

 

శ్రీలంకతో రెండో వన్డేలో భారత్ ఓడిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రధాన బ్యాట్స్ మెన్ అంతా విఫలమయ్యారు. 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఉన్నది ప్రధాన బౌలర్లు అయిన దీపక్ చాహర్, భువనేశ్వర్ లు. శ్రీలంక ఆటగాళ్లు అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు. ఇక టీమిండియా ఓటమి ఖాయం అనుకున్నారంతా.. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది..

టీమిండియా ప్రధాన బౌలర్ దీపక్ చాహర్ ఒక అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ గా మారిపోయాడు. సీనియర్ బ్యాటింగ్ చేసినట్టు చేశాడు. 276 పరుగుల లక్ష్యాన్ని చేధించాడు. భువనేశ్వర్ తో కలిసి మంచి భాగస్వామ్యం ఏర్పాటు చేసి చాహర్ జట్టు స్కోర్ ను పరుగులు పెట్టించాడు. 69 పరుగులతో దీపక్ చాహర్, 19 పరుగులతో భువనేశ్వర్ రాణించడంతో భారత్ ఓడిపోతున్న స్థితి నుంచి అద్భుత విజయాన్ని సాధించింది. దీనంతటికి కారణం దీపక్ చాహరే. అతడే చివర్లో అడ్డుగోడగా నిలబడి గెలుస్తున్న శ్రీలంకను ఓడించాడు. భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టులు 193 పరుగులకే అందరూ టాప్ బ్యాట్స్ మెన్ ఔట్ అయ్యి 7 వికెట్లతో ఓటమి అంచులో నిలబడింది. కానీ దీపక్ చాహర్ 69 పరుగులతో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

టీమిండియా నిన్న గెలిచిందంటే అది దీపక్ చాహర్ వల్లే. అతడు బౌలర్ అయినా సమయోచితంగా బ్యాటింగ్ చేసి భారత్ కు అద్భుత విజయాన్ని అందించాడు. అనుకోకుండా టీమిండియా తరుఫున హీరో అయ్యాడు.