World Chess Championship 2024: మొన్నటివరకు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ చివరి అంకం ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. అంగరంగ వైభవంగా ముగిశాయి. ఇప్పుడిక అసలైన యుద్ధానికి సమయం ఆసన్నమైంది. కోవైపు డిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్.. మరోవైపు చాలెంజర్ గుకేష్.. ఎవరు గెలుస్తారనేది ఆసక్తి కరం.. వరల్డ్ చెస్ క్రౌన్ కోసం వీరిద్దరూ 14 రౌండ్లలో పోటీ పడతారు.. టోర్నీలో భాగంగా తొలి రౌండు సోమవారం జరుగుతుంది.. విజయం సాధిస్తే ఒక పాయింట్.. డ్రా గా ముగిస్తే అర పాయింట్ దక్కుతాయి.. ముందుగా 7.5 పాయింట్ల వరకు చేరుకున్న వారిని నిర్వాహకులు విన్నర్ గా డిక్లేర్ చేస్తారు. 14 గేమ్ ల తర్వాత కూడా ఆటగాళ్లు చేసిన స్కోర్ సమం ఉంటే టైప్ బ్రేకర్ ద్వారా విన్నర్ ను డిసైడ్ చేస్తారు. సింగపూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.. అయితే భారత దేశం నుంచి గుకేష్ విజేతగా నిలుస్తాడని చదరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.”ఒత్తిడి అనేదానిని అతడు దరి చేరనీయ్యడు.. కఠిన పరిస్థితుల్లోనూ మెరుగైన ఎత్తులు వేస్తాడు. అయితే ఈసారి జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో అతడు ధైర్యంగా ఆడతాడు. అద్భుతమైన ఎత్తులు వేస్తాడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని” వ్యాఖ్యానిస్తున్నారు.. మరోవైపు లిరెన్ గత ఏడాది ఇయాన్ (రష్యా) తో హోరాహోరీగా ఆడాడు. చివరికి విజయం సాధించాడు. అయితే లిరెన్ అప్పటినుంచి మెంటల్ గా ఇబ్బంది పడుతున్నాడు. స్ట్రెస్ ను ఎదుర్కోలేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాడు.. గుకేష్ ఇటీవల కాలంలో అనేక టోర్నీలలో పాలుపంచుకున్నాడు. మానసిక సమస్యల వల్ల లిరెన్ తక్కువ టోర్నీలలో పోటీపడ్డాడు. 2012లో విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. అయితే ఇప్పుడు వరకు మరోసారి భారత్ ఆ ఘనతను అందుకోలేకపోయింది. అయితే ఈసారి చరిత్రను తిరగరాయాలని గుకేష్ తిరుగులేని పట్టదలతో ఉన్నాడు.. అంతేకాదు గత ఏడాది డిసెంబర్లో క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి గుకేష్ క్వాలిఫై అయ్యాడు. అదే కాదు ప్రపంచ చేసి చాంపియన్ షిప్ వైపు అతడు వేగంగా అడుగులు వేస్తున్నాడు..
దిగ్గజాలను తలదన్ని
గుకేష్ హార్ట్ ఫేవరెట్ లు కరువాన, నకమురా ను తలదన్నాడు. వారిని ఓడించి కాండిడేట్స్ టోర్నమెంట్ టైటిల్ దక్కించుకున్నాడు. కొత్త సంవత్సరం సృష్టించాడు బుడాపెస్ట్ లో జరిగిన చెస్ ఒలంపియాడ్ లో భారత పురుషుల జట్టు స్వర్ణాన్ని దక్కించుకోవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.. గణాంకాల ప్రకారం చూసుకుంటే గుకేష్ లిరెన్ పై పై చేయి సాగిస్తున్నాడు. గత నవంబర్ నుంచి ఇప్పటివరకు 37 రేటింగ్ పాయింట్స్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇక్కడ లిరెన్ ఏకంగా 52 పాయింట్లు కోల్పోయాడు. రేటింగ్ పాయింట్ల ప్రకారం ముందంజలో ఉండడంతో గుకేష్ సానుకూల దృక్పథంతో ఉన్నాడు. కచ్చితంగా విజయం సాధిస్తానని.. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని స్పష్టం చేస్తున్నాడు. 12 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతానని అతడు ఇప్పటికే స్పష్టం చేశాడు.