https://oktelugu.com/

Everyone Who Bought a Car : లోన్ తీసుకొని కారు కొన్న వారందరూ ఈ విషయం తెలుసుకోవాలి.. లేదంటే డేంజరే

కారు కొనుగోలు చేయాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ ఒకేసారి లక్షల్లో ఆదాయం వెచ్చించాలంటే మనసు రాదు. నెలనెల ఈఎంఐ రూపంలో చెల్లించడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటారు. దీంతో కారును లోన్ ద్వారా కొనుగోలు చేస్తారు. Loan ద్వారా కారు కొనుగోలు చేయడం వల్ల మినిమం వడ్డీని విధిస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 25, 2024 / 11:21 AM IST

    Car-Lone

    Follow us on

    Everyone Who Bought a Car : కారు కొనుగోలు చేయాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ ఒకేసారి లక్షల్లో ఆదాయం వెచ్చించాలంటే మనసు రాదు. నెలనెల ఈఎంఐ రూపంలో చెల్లించడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటారు. దీంతో కారును లోన్ ద్వారా కొనుగోలు చేస్తారు. Loan ద్వారా కారు కొనుగోలు చేయడం వల్ల మినిమం వడ్డీని విధిస్తారు. ఒక్కోసారి ఆఫర్లు ప్రకటించి ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు వంటివి ఉంటాయి. అయితే Loan ద్వారా కొనుగోలు చేసిన తరువాత తమ కారు సొంతం అయిందని సంబరపడిపోతుంటారు. నెలనెల ఈఎంఐ చెల్లిస్తే చాలు అనుకుంటారు. కానీ ఇలా కారు కొనుగోలు చేస్తే దానికి మీరు ఓనర్ కాదు. ఈ కారుకు ఇంకొకరు ఓనర్ గా వ్యవహరిస్తారు. వారు ఎవరంటే?

    కారు కొనుగోలు చేసేవారికి బ్యాంకులు లోన్ ఇస్తుంటాయి. చాల తక్కువ వడ్డీతో కారు కొనుగోలు చేసేందుకు సహకరిస్తారు. అయితే కారు కొనుగోలు చేసే సమయంలో కారు ప్రైస్ మొత్తం బ్యాంకు కారు కంపెనీకి చెల్లిస్తుంది. ఇందుకు గాను వినియోగదారుడి నుంచి కొంత వడ్డీని చెల్లిస్తుంది. ఇది మిగతా రుణాల కంటే తక్కువగానే ఉంటుంది. కారు కొనుగోలు చేసిన తరువాత ఎలాగూ తమ కారే కదా.. అని చాలా మంది రెగ్యులర్ గా ఈఎంఐలు చెల్లించకుండా ఉంటారు. దీంతో ఇవి మిస్సయి అధిక వడ్డీని కట్టాల్సి వస్తుంది. ఈ భారం మరింత పెరిగి అలాగే ఉండిపోతారు. దీంతో ఈ కారును లోన్ ఇచ్చిన బ్యాంకు సీజ్ చేస్తుంది.

    ఇలా కారును సీజ్ చేసే అధికారం బ్యాంకుకు ఉంటుంది. ఎందుకంటే ఈ కారుకు బ్యాంకు కూడా ఓనర్ కాబట్టి. అదెలాగంటే? కారు కొనుగోలు చేసిన సమయంలో ఫైనాన్ష్ ద్వారా తీసుకుంటే.. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో కారు కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు ఫైనాన్స్ సదుపాయం కల్పించిన బ్యాంకు పేరు కూడా రిజిస్ట్రేషన్ పేపర్స్ పై ఉంటాయి. అంటే కారు కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు బ్యాంకు కూడా ఓనర్ అన్నమాటే. అయితే రెగ్యులర్ గా ఈఎంఐలు చెల్లించడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈఎంఐలు చెల్లించకపోవడంతో కారు సీజ్ చేసే అధికారం ఉంటుంది.

    మరి ఈఎంఐలు పూర్తి అయిన తరువాత కూడా బ్యాంకు ఓనర్ గా ఉంటుందా? అంటే అస్సలు ఉండదు. అయితే ఇక్కడో పని చేయాలి. కారుకు సంబంధించిన ఈఎంఐ పూర్తయిన తరువాత బ్యాంకుకు వెళ్లి తమ సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఫాం 35తో పాటు ‘నో డ్యూ ’ సర్టిఫికెట్ అందిస్తారు. ఈ రెండింటితో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డులను కలిపి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇవ్వాలి. దీంతో ఆర్టీవో అధికారులు ఈ వివరాలను చెక్ చేసుకున్న తరువాత కొత్త రిజిస్ట్రేషన్ పేపర్స్ ను అందిస్తారు.

    అయితే ఫైనాన్స్ తీసుకున్న తరువాత ఆర్సీ కార్డుపై కొరు కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు ఫైనాన్స్ చేసిన సంస్థ పేరు ఉంటుంది. ఈఎంఐలు పూర్తయిన తరువాత డాక్యుమెంట్లు సమర్పిస్తే ఈ పేరును అధికారులు తొలగిస్తారు. ఇలా వ్యక్తి పేరు మాత్రమే ఉండి.. ఫైనాన్స్ సంస్థ పేరు లేకపోతే అప్పడు పూర్తి స్థాయిలో వ్యక్తి మాత్రమే ఓనర్ అవుతాడు.