DC Vs RCB IPL 2025: విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే దూకుడుకు మారుపేరుగా.. బీభత్సానికి పర్యాయపదంగా కనిపిస్తాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగే మొనగాడు దర్శనమిస్తాడు. అయితే అలాంటి విరాట్ కోహ్లీ అప్పుడప్పుడు కట్టుతప్పుతుంటాడు . భరించలేని కోపంతో కనిపిస్తాడు. విపరీతమైన ఆవేశంతో రెచ్చిపోతుంటాడు. సమయంలో విరాట్ కోహ్లీని కంట్రోల్ చేయడం ఇతర ఆటగాళ్లకు సాధ్యం కాదు. తనను తాను కంట్రోల్ చేసుకోవడం విరాట్ కోహ్లీ వల్ల కాదు. అందువల్లే ఆ సమయంలో అతడిని అలా వదిలేస్తుంటారు. లేకపోతే ఇంకా ఎక్కువ చేస్తాడని.. అప్పుడు మరింత రచ్చ అవుతుందని తోటి ఆటగాళ్లు భావిస్తుంటారు. విరాట్ కోహ్లీ ఇలా వ్యవహరించడం ఒకటో, రెండో సార్లు కాదు. అనేక పర్యాయాలు ఇలానే ఆవేశపరుడిగా.. ఉద్రేకపరుడిగా.. చిత్తాన్ని కోల్పోయిన వ్యక్తిగా విరాట్ కోహ్లీ కనిపించాడు. అతని ఆవేశం వల్ల కొంతమందిని దూరం చేసుకున్నప్పటికీ.. కొంతమంది స్నేహానికి దూరం అయినప్పటికీ విరాట్ కోహ్లీ మారడం లేదు. మారే దిశగా ఆలోచించడం లేదు. ఇలా రాస్తుంటే విరాట్ కోహ్లీ అభిమానులకు ఇబ్బంది కలుగవచ్చు. వారికి మాపై కోపం కూడా రావచ్చు. కానీ వాస్త పరిస్థితి అలా ఉంది కాబట్టి.. మేం కూడా రాయకుండా ఉండలేకపోతున్నాం కాబట్టి.. చేసేది ఏమీ లేదు.
Also Read: ఢిల్లీని పక్కనపెట్టిన ముంబై.. ఆ ఒక్క అడుగు వేస్తే పాయింట్ల పట్టికలో..
కాసుల క్రీడలో ఇదేం పని?
వాస్తవానికి ఐపీఎల్ అనేది కేవలం కాసుల కోసం మాత్రమే పుట్టిన క్రీడ. ఇందులో కొంతమందికి అవకాశాలు వస్తూ ఉండొచ్చు. దానిని కాదనలేం . ఐపీఎల్ ఆడుతున్నంతసేపు ఆటగాళ్లు ఉద్రేకాలకు, ఉద్వేగాలకు లోను కాకుండా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటీవల పంజాబ్ జట్టుతో బెంగళూరు ఆడింది. ఆ సమయంలో బెంగళూరు జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందు చిత్రవిచిత్రంగా డ్యాన్స్ వేశాడు. ఒక రకంగా శ్రేయస్ అయ్యర్ ను గేలి చేశాడు. దీంతో ఇది మరింత పెంట్ అవుతుందని భావించిన అయ్యర్ వెంటనే వెళ్లి విరాట్ కోహ్లీని ఆ లింగనం చేసుకున్నాడు. దీంతో గొడవ కు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ తర్వాత ఆదివారం నాటి మ్యాచ్లో కేఎల్ రాహుల్ తో విరాట్ కోహ్లీ గొడవ పడ్డట్టుగా కనిపించాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా కేఎల్ రాహుల్ ను గేలి చేశాడు. దీంతో కేఎల్ రాహుల్ కూడా సైలెంట్ అయిపోయాడు. ఎందుకు అనవసరంగా దీనిని పెద్దది చేయడం అని భావించి.. వెంటనే విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి మాట్లాడాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్ కూడా ముగిసింది. కాకపోతే ఈ రెండు సందర్భాల్లో విరాట్ కోహ్లీ తన స్థిర చిత్తాన్ని కోల్పోయి పరువు తీసుకున్నాడు. ఇతర దేశాల ఆటగాళ్లను పక్కన పెట్టి సొంత జాతీయ జట్టు ఆటగాళ్లపై విరాట్ కోహ్లీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుండడంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తం అవుతుంది. “మొన్ననేమో శ్రేయస్ అయ్యర్ ముందు డ్యాన్స్ చేశాడు. ఇప్పుడేమో కేఎల్ రాహుల్ ఏదో చేశాడు. చూస్తుంటే విరాట్ కోహ్లీకి ఏదో అయ్యిందనిపిస్తోందని” సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: లక్నోపై “సూర్య”ప్రతాపం.. ఐపీఎల్ లో తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు