MI Vs LSG IPL 2025: ఈ విజయం ద్వారా ముంబై జట్టు పాయింట్లు పట్టికలో రాకెట్ లాగా దూసుకుపోయింది. వరుసగా ఐదు విజయాలు సాధించి ముంబై జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. ఢిల్లీ జట్టును పక్కనపెట్టి.. గుజరాత్ టైటాన్స్ తర్వాత స్థానంలో నిలిచింది.. ఈ సీజన్లో తొలి మ్యాచ్ చెన్నై తో ఆడిన ముంబై ఓడిపోయింది.. ఆ తర్వాత గుజరాత్ జట్టుతో తలపడి ఓటమిపాలైంది.కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో పోటీపడి విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో తొలి విజయం నమోదు చేసింది. ఆ తర్వాత లక్నో, బెంగళూరు జట్లతో జరిగిన మ్యాచ్లో ముంబై ఓటమిపాలైంది. దీంతో అందరూ ముంబైజట్టు పని అయిపోయిందని అనుకున్నారు. ఈ సీజన్లో కూడా గ్రూప్ దశ నుంచే వెళ్ళిపోతుందని భావించారు. కానీ ముంబై జట్టు తన ఆట తీరు పూర్తిగా మార్చేసుకుంది. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలిచి.. ఇక విజయాల పరంపర మొదలుపెట్టింది.
Also Read: లక్నోపై “సూర్య”ప్రతాపం.. ఐపీఎల్ లో తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు
ఏకంగా రెండో స్థానంలో..
ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలిచిన ముంబై.. ఆ తర్వాత చెన్నై పై ఒకసారి, హైదరాబాద్ పై రెండుసార్లు, లక్నోపై విజయాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్.. ఫీల్డింగ్ విభాగాలలో అదరగొడుతూ ముంబై జట్టు ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్ బరిలోకి వచ్చేసింది. ఆ జట్టు ఓపెనర్లు.. బౌలర్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నారు. సొంత మైదానమే కాదు.. ప్రత్యర్థి జట్ల మైదానాలలో సైతం అదరగొడుతున్నారు. దీంతో ముంబై జట్టు వరుసగా ఐదు విజయాలు సాధించింది.. ప్రస్తుతం ముంబై జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి..+0.899 నెట్ రన్ రేటు తో రెండవ స్థానంలో ఉంది.. ముంబై జట్టు ఇదే జోరు కొనసాగిస్తే సులభంగా ప్లే ఆఫ్ వెళ్తుంది.. ముంబై జట్టు తన తదుపరి మ్యాచులు రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ జట్లతో ఆడాల్సి ఉంది.
సరికొత్తగా
ఈ సీజన్లో తొలత ఓటములు ఎదుర్కొన్న ముంబై జట్టు.. ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. సొంత మైదాన మాత్రమే కాకుండా.. ప్రత్యర్థి జట్ల మైదానాలపై కూడా ఆకట్టుకుంటున్నది. బ్యాటింగ్లో సరికొత్త ప్రదర్శన చేస్తోంది. బౌలింగ్లో అదరగొడుతోంది. మొత్తంగా చూస్తే ప్రత్యర్థి జట్లకు ఏమాత్రం అందని తీరులో ఆట తీరు ప్రదర్శిస్తోంది. ముంబై జట్టు ఆట తీరు చూసి క్రికెట్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో ముంబై జట్టు గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఆడుతోంది. ఓటమి నుంచి గెలుపును దక్కించుకొని.. ఏకంగా పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలోకి చేరుకుంది