DC Vs RCB IPL 2025: బెంగళూరు ఘనవిజయం సాధించడంతో.. కన్నడ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సోషల్ మీడియాలో బెంగళూరు జట్టును వారు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు మిస్ అయ్యాం.. ఈసారి మాత్రం మిస్ కాదు.. కచ్చితంగా కప్ కొడుతున్నామంటూ సోషల్ మీడియాలో వారు వ్యాఖ్యలు చేస్తున్నారు.. గత సీజన్లలో బెంగళూరు జట్టు కొంతమేర తడబాటుకు గురైందని.. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదని బెంగళూరు అభిమానులు పేర్కొంటున్నారు. ఈసారి ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని.. బీభత్సమైన ప్రదర్శన చేస్తున్నారని.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారని వివరిస్తున్నారు. బలమైన ముంబై, అంతే బలమైన కోల్ కతా, వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ వంటి జట్లను బెంగళూరు మట్టి కరిపించిందని.. ఈసారి ఐపీఎల్ ట్రోఫీని సాధించడం ఖాయమని.. బెంగళూరు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మొన్న శ్రేయస్ అయ్యర్.. నిన్న కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీకి ఏమైంది?
గత చరిత్ర ఏం చెబుతోందంటే..
ప్రస్తుత ఐపిఎల్ లో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు బెంగళూరు 10 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఏడు విజయాలు సాధించింది. ప్రస్తుతం బెంగళూరు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ +0.521 గా ఉంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ జట్లతో జరిగిన మ్యాచ్లో మాత్రమే బెంగళూరు ఓటమిపాలైంది. చెన్నై, ముంబై, రాజస్థాన్ , పంజాబ్ (ఒక మ్యాచ్లో ఓడిపోయింది.. మరో మ్యాచ్లో గెలిచింది), ఢిల్లీ క్యాపిటల్స్ (ఒక మ్యాచ్లో ఓడిపోయింది.. మరో మ్యాచ్లో గెలిచింది) వంటి జట్లపై విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏకంగా నెంబర్ వన్ స్థానంలో ఉంది. అభిమానులపరంగా, ఆటగాళ్లపరంగా చెన్నై, ముంబై, కోల్ కతా జట్లకు ఏమాత్రం తీసిపోదు బెంగళూరు. పైగా బెంగళూరు జట్టులో ఈసారి భీకరమైన ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్ కూడా అదే స్థాయిలో ఉంది.. బెంగళూరు ఐపీఎల్ లో అత్యంత దురదృష్టకరమైన జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఏకంగా మూడుసార్లు ఫైనల్ వెళ్లినప్పటికీ.. ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. ఐపీఎల్ ప్రారంభమైన మరుసటి సంవత్సరం అంటే 2009లో బెంగళూరు ఫైనల్ వెళ్లినప్పటికీ.. నాటి దక్కన్ చార్జర్స్ చేతిలో ఓడిపోయింది. సరిగా రెండు సంవత్సరాలు అనంతరం అంటే 2011లో ఫైనల్ వెళ్ళింది. నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా రెండోసారి కూడా ఫైనల్ వెళ్ళినప్పటికీ ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేకపోయింది. ఇక ముచ్చటగా మూడోసారి అంటే 2016లో ఫైనల్ వెళ్లినప్పటికీ.. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. మూడుసార్లు కూడా ఫైనల్ వెళ్లినప్పటికీ ఒక్కసారి కూడా ట్రోఫీ దక్కించుకోలేని అత్యంత దురదృష్టకరమైన జట్టుగా బెంగళూరు అపఖ్యాతి మూటగట్టుకుంది.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. అయితే ఇదే ఊపు ప్లే ఆఫ్ , ఫైనల్లో కొనసాగిస్తుందా.. బెంగళూరు జట్టు తన మీద ఉన్న చెడ్డ పేరును తొలగించుకుంటుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
Also Read: ఢిల్లీని పక్కనపెట్టిన ముంబై.. ఆ ఒక్క అడుగు వేస్తే పాయింట్ల పట్టికలో..