Homeక్రీడలుDC vs CSK IPL 2023: రారా.. రారా.. యెక్కసెక్క.. ఐపీఎల్‌లో ఫన్నీ సీన్‌!

DC vs CSK IPL 2023: రారా.. రారా.. యెక్కసెక్క.. ఐపీఎల్‌లో ఫన్నీ సీన్‌!

DC vs CSK IPL 2023: ఐపీల్‌–2023 లీగ్‌ మ్యాచ్‌లు ఒకవైపు చివరి బంతి వరకూ ఉత్కంఠగా.. మరోవైపు వీరోచితంగా.. ఇంకో వైపు ఫన్నీగా సాగుతున్నాయి. క్రికెటర్ల ఆటతీరును అభిమానులు ఆస్వాదిస్తున్నారు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో వార్నర్, జడేజా మధ్య జరిగిన ఈ ఫన్నీ సంఘటన నవ్వులు పూయించింది.

పరుగు కోసం అతడు.. రన్‌ఔట్‌ కోసం ఇతడు..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే భారీ స్కోర్‌ చేసింది. 20 ఓవర్లలో 223 పరుగుల చేసింది. భారీ లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బరిలీ దిగింది. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ దీపక్‌ చహర్‌ వేశాడు. ఓవర్‌ మూడో బంతిని వార్నర్‌ కవర్స్‌ దిశగా ఆడాడు. రిస్క్‌ ఉన్నప్పటికి సింగిల్‌ పూర్తి చేశాడు. అయితే మొయిన్‌ అలీ త్రో వేయగా రహానే దానిని అందుకున్నాడు. ఇక్కడ వార్నర్‌ మరో పరుగు తీయడానికి ప్రయత్నించాడు. వార్నర్‌ క్రీజ్‌లో నుంచి కాస్త ముందుకు పరిగెత్తాడు.. రహానే బాల్‌ త్రో వేస్తా అన్నట్లు రెడీ అయాయరు. ఇంతలో అవతలి ఎండ్‌లో ఉన్న జడేజా బంతి తనకు వేయమంటూ సైగ్‌ చేశాడు.

దీంతో రహానే బంతిని జడ్డూవైపుకు విసిరాడు. అప్పటికే వార్నర్‌ క్రీజులోకి వెళ్లిపోయాడు. కానీ ఇక్కడే ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. బంతిని అందుకున్న జడ్డూ త్రో వేస్తానని బెదిరించడం.. వార్నర్‌ కూడా నాకేం భయం లేదు అన్నట్లుగా క్రీజు దాటాడు.. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. చిన్నప్పుడు గల్లీలో ఆడిన క్రికెట్‌ను ప్రతీ అభిమానికి గుర్తు తెచ్చారు.

జడ్డూ స్టైల్‌లో బ్యాట్‌ తిప్పుతూ..
ఇంతలో వార్నర్‌ కూడా జడ్డూ స్టైల్‌లో బ్యాట్‌ను పైకి ఎత్తి గాల్లో తిప్పాడు. జడ్డూ కూడా ఆఫ్‌ సెంచరీ చేసినప్పుడు, జట్టును గెలిపించినప్పుడు ఇలాగే తిప్పుతాడు.. తన స్టైల్లో వార్నర్‌ బ్యాట్‌ తిప్పడాన్ని చూసి.. బాల్‌ త్రో వేయడం మర్చిపోయిన జట్టు నవ్వుతూ ఆడియన్స్‌ వైపు తిరిగాడు. దీంతో స్టేడియం మొత్తం నవ్వులు పూశాయి. ఈ సన్నివేశాన్ని వార్నర్, జడ్డూ చర్యను పిలిప్‌ సాల్ట్‌ సహా సీఎస్‌కే ఆటగాళ్లు బాగా ఎంజాయ్‌ చేశారు.

నెట్టింట్లో వైరల్‌..
ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. చాలా మంది తమ చిన్ననాటి క్రికెట్‌ ఆటను గుర్తుచేసుకుంటూ వాట్సాప్‌ స్టేటస్‌లు కూడా పెట్టుకున్నారు. ఇన నెటిజన్లు అయితే అటు జడ్డూను, ఇటు వార్నర్‌ను అభినందిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో డీసీ 77 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular