Homeలైఫ్ స్టైల్Meta Vs Twitter: మెటా నుంచి మరో కొత్త యాప్‌.. ట్విట్టర్‌కు పోటీగా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌...

Meta Vs Twitter: మెటా నుంచి మరో కొత్త యాప్‌.. ట్విట్టర్‌కు పోటీగా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ..!

Meta Vs Twitter: ఇంటర్నెట్‌ చౌకగా అందుబాటులోకి వచ్చాక సోషల్‌ మీడియాను ప్రపంచ వ్యాప్తంగా విచ్చలవిడిగా వాడేస్తున్నారు. సెలబ్రిటీ నుంచి సామాన్యుడి వరకు ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామంలో ఖాతా లె రుస్తున్నారు. కాస్త ఖాలీ సమయం దొరికితే చాలు సోషల్‌ మీడియాలోనే ఉంటున్నారు. ఎన్ని సోషల్‌ సైట్లు వచ్చినా అన్నింటిలోనూ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం సైట్లు ఉన్న మెటా సంస్థ మరో సోషల్‌ మీడియా యాప్‌ తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ను పోలిన ఈ యాప్‌ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

ట్విట్టర్‌కు పోటీగా..
ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్నప్పటి నుంచి అందులో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ట్విటర్‌లో పాలసీ పరమైన నిబంధనలు మార్పులు కొందరికి రుచించడం లేదు. దీనిపై కొందరు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ప్రత్యామ్నాయ వేదికలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విటర్‌కు పోటీగా మాస్టోడాన్, ట్విటర్‌ మాజీ బాస్‌ జాక్‌ డోర్సీ బ్లూ స్కై వచ్చాయి. ఇప్పుడు ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా సైతం ట్విటర్‌కు పోటీగా కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటికే టెస్టింగ్‌..
ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌పై కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిసి మెటా టెస్టింగ్‌ నిర్వహిస్తోందని తెలిసింది. సంబంధిత స్క్రీన్‌షాట్లు సైతం బయటకొచ్చాయి. అయితే ఈ యాప్‌కు ఇంతవరకు పేరు పెట్టనప్పటికీ.. పీ92, బార్సిలోనా పేర్లతో ఇంటర్నల్‌గా పిలుచుకుంటున్నారు. ఇది సపరేట్‌ యాప్‌గానే ఉండబోతోందని, అయితే, ఇన్‌స్టా యూజర్లు తమ అకౌంట్‌తో కనెక్ట్‌ అయ్యేందుకు వీలు కల్పించనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఈ కొత్త యాప్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇన్‌స్టా తరహాలో..
ఈ యాప్‌ దాదాపు ఇన్‌స్టాను పోలి ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఫొటోలు, వీడియోలతో కూడిన ఫీడ్‌ కాకుండా టెక్ట్స్‌ ఆధారిత టైమ్‌లైన్‌ పోస్టులు కనిపించనున్నాయి. అంటే ఇది అచ్చం ట్విటర్‌ను పోలి ఉండబోతోందన్నమాట. 500 అక్షరాల వరకు టెక్ట్స్‌ రాసుకోవడంతోపాటు ఫొటోలు, వీడియోలు సైతం యాడ్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న వారిని ఒక్క క్లిక్‌తో కొత్త యాప్‌లోనూ ఫాలో అయ్యే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా భారీగా యూజర్ల బేస్‌ను సంపాదించుకున్న మెటా.. మరి కొత్త యాప్‌తో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular