SRH in IPL 2021 : వార్నర్ మళ్లీ వచ్చేశాడు.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ జట్టు ఇదే

SRH in IPL 2021 : భారత్ లో జరిగిన ఐపీఎల్‌-2021 అర్ధంత‌రంగా ఆగిపోయే నాటికి 29 మ్యాచ్ లు జ‌రిగాయి. ఆ స‌మ‌యానికి పాయింట్ల ప‌ట్టిక‌లో ఢిల్లీ కేపిట‌ల్స్ టాప్ లో ఉంటే.. హైద‌రాబాద్ జ‌ట్టు అట్ట‌డుగున ఉంది. 7 మ్యాచులు ఆడిన హైద‌రాబాద్‌.. కేవ‌లం ఒకే ఒక విజ‌యం సాధించింది. దీంతో కేవ‌లం 2 పాయింట్లు సాధించి ఆఖ‌రున నిలిచింది. దీంతో.. ప్లే ఆఫ్ బెర్త్ అత్యంత క్లిష్టంగా క‌నిపిస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఇంకా.. […]

Written By: K.R, Updated On : September 22, 2021 12:33 pm
Follow us on

SRH in IPL 2021 : భారత్ లో జరిగిన ఐపీఎల్‌-2021 అర్ధంత‌రంగా ఆగిపోయే నాటికి 29 మ్యాచ్ లు జ‌రిగాయి. ఆ స‌మ‌యానికి పాయింట్ల ప‌ట్టిక‌లో ఢిల్లీ కేపిట‌ల్స్ టాప్ లో ఉంటే.. హైద‌రాబాద్ జ‌ట్టు అట్ట‌డుగున ఉంది. 7 మ్యాచులు ఆడిన హైద‌రాబాద్‌.. కేవ‌లం ఒకే ఒక విజ‌యం సాధించింది. దీంతో కేవ‌లం 2 పాయింట్లు సాధించి ఆఖ‌రున నిలిచింది. దీంతో.. ప్లే ఆఫ్ బెర్త్ అత్యంత క్లిష్టంగా క‌నిపిస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఇంకా.. 7 మ్యాచులు ఆడాల్సి ఉండ‌గా.. ఇందులో ఏకంగా 6 విజ‌యాలు సాధించాలి. అప్పుడే.. ప్లేఆఫ్ కు చేరుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంది.

అయితే.. ఎన్నో ఆశ‌లుపెట్టుకున్న వార్న‌ర్ (David Warner).. త‌న స్థాయికి త‌గిన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించ‌లేదు. జ‌ట్టును గెలిపించ‌లేక‌పోవ‌డంతోపాటు వ్య‌క్తిగ‌తంగా కూడా పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. దీంతో.. కెప్టెన్సీతోపాటు జ‌ట్టులో చోటు కూడా కోల్పోయాడు. దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో ద‌శ‌లో తొలి మ్యాచ్ ఆడ‌బోతోంది హైద‌రాబాద్ జ‌ట్టు. ఇప్ప‌టి నుంచి ఆడే ప్ర‌తీమ్యాచ్ డూ ఆర్ డై అన్న ప‌రిస్థితి నెల‌కొన‌డంతో యాజ‌మాన్యం ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటోంది.

జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా ఉన్న బెయిర్ స్టో త‌ప్పుకున్నాడు. దీంతో.. అత‌ని స్థానంలో డేవిడ్ వార్న‌ర్ ను తీసుకోవాల‌ని జ‌ట్టు నిర్ణ‌యించింది. టోర్నీకి మ‌ధ్య‌లో గ్యాప్ రావ‌డం.. వేదిక కూడా మార‌డంతో.. వార్న‌ర్ వంటి స్టార్ ను తిరిగి జ‌ట్టులోకి తీసుకోవాల‌ని డిసైడ్ చేసింది. వృద్ధిమాన్ సాహాతో క‌లిసి ఓపెనింగ్ చేయ‌బోతున్నాడు వార్న‌ర్. ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టు పగ్గాలను కేన్ కు కట్టబెట్టింది మేనేజ్ మెంట్.

గాయం కారణంగా తొలి భాగంలోనే తప్పుకున్న యార్కర్ కింగ్ నటరాజన్ కూడా జట్టులోకి వచ్చేశాడు. దుబాయ్ వేదికగా జరిగిన గత సీజన్ లో నటరాజన్ (Natarajan) అద్భుతమైన ప్రతిభ చాటాడు. అందువల్ల.. ఇప్పుడు కూడా చెలరేగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటు ప్ర‌పంచ‌క‌ప్ కూడా అక్క‌డే జ‌రిగే అవ‌కాశం ఉండ‌డంతో.. వార్న‌ర్ ఫామ్ ను అందిపుచ్చుకుంటాడ‌ని యాజ‌మాన్యంతోపాటు ఫ్యాన్స్ ఆశ‌గా ఉన్నారు.

అంచ‌నా ప్ర‌కారం.. ఢిల్లీతో పోటీ ప‌డే స‌న్ రైజర్స్ జ‌ట్టు ఈ విధంగా ఉండే అవ‌కాశం ఉంది. డేవిడ్ వార్న‌ర్‌, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియ‌మ్స‌న్, మ‌నీశ్ పాండే, అబ్దుల్ స‌మ‌ద్‌, విజ‌య్ శంక‌ర్‌, మ‌హ‌మ్మ‌ద్ న‌బీ/రూథర్ ఫోర్డ్/ జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ తుది జట్టులో ఉండే అవ‌కాశం ఉంది.