మరోవైపు దివ్య తన అన్నయ్య బాధ పడటం చూసి శృతి దగ్గరికి వెళ్లి ఎందుకు అన్నయ్యను ఇలా బాధ పెడుతున్నావు అంటూ అన్నయ్యని నువ్వు కూడా ప్రేమించావు కదా మరి ఇప్పుడెందుకు ఒప్పుకోవడం లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ప్రశ్నలు వేస్తోంది. ఇక తులసి కారులో వస్తూ అక్షరకు ప్రేమ్ పై ఉన్న ప్రేమను చూసి మురిసిపోతుంది. ఇక తన కూతురు ప్రేమ కోసం డీకే ఎంతో తపన పడుతున్నాడు అని సంతోషంగా ఫీల్ అవుతుంది.
అక్షర లాంటి అమ్మాయి దొరుకుతే ప్రేమ్ జీవితం బాగుంటుంది అని కానీ ప్రేమ్ సంతోషంగా ఉండడు అంటూ శృతిని ఎలాగైనా ప్రేమ్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. మరో వైపు శృతి లాస్య అన్న మాటలను తలుచుకొని ఏడుస్తుంది. లేదంటే ఇంట్లో వాళ్లందరినీ బ్రతకనివ్వదు అంటూ ఎలాగైనా ప్రేమ్ కి దూరంగా వెళ్లిపోవాలి అని అనుకుంటుంది. దారిలో తులసిని చెక్కు బౌన్స్ విషయంలో జైలుకు పంపించిన పురుషోత్తం లాస్య కి ఫోన్ చేసి డబ్బులు పంపించమని మాట్లాడుతాడు.
వెంటనే తులసికి పురుషోత్తం అడ్డంగా దొరికిపోతాడు. తులసి వెంటనే అతడిని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లి అందరి ముందు నిలబెడుతుంది. లాస్య.. పురుషోత్తం ని చూసి టెన్షన్ పడుతుంది. ఎక్కడ నిజం బయటపెడతాడో అని భయపడుతుంది. ఇక తులసి తనను జైలుకు పంపించింది ఇతడే అంటూ అని చెప్పే సరికి అనసూయమ్మ, నందు తులసి మాటలు నమ్మలేకపోతారు. తులసి కూడా వారిపై గట్టిగా మాట్లాడటంతో తిరిగి తులసినే తిడుతారు. ఇక నిజమేంటో ఇప్పుడే బయటపడేలా చేస్తా అంటూ పురుషోత్తంను ఏం జరిగిందో చెప్పమంటుంది.