Guppedantha Manasu Serial: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ, ప్రేమ కథతో సాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా బాగా దూసుకుపోతుంది. ఇక రిషి పెద్దనాన్న ఇంటికి వెళ్లి దేవయానితో రిషి కోపంగా ఉన్న విషయాన్ని చెప్పడంతో.. దేవయాని తన మనసులో వసు.. జరిగిన విషయం చెప్పిందేమో అని టెన్షన్ పడుతుంది. ఇక ధరణిని వసుకి ఫోన్ చేసి కనుక్కోమని అడుగుతుంది. ధరణి మళ్లీ రిషి కి అనుమానం తెప్పించిన వాళ్ళం అవుతామని అనేసరికి ఊరుకుంటుంది.
కానీ ధరణి వసుతో మాట్లాడాలని ఫోన్ చేస్తుంది. ఇక వసు, రిషి వాళ్లు కాఫీ షాప్ లో ఉంటారు. వసు రిషి కి ఒక ట్విస్ట్ ఇస్తుంది. వేడివేడి కాఫీ, చల్ల చల్లని ఐస్ క్రీమ్ తీసుకొచ్చి అందులో వేడి మీ కోపం, చల్లదనం మీ మంచి మనసు అంటూ కోపాన్ని, మంచి మనసుని ఒకేసారి చూడలేం అంటూ గుణపాఠం చెప్పాలని ప్రయత్నిస్తుంది. అలాగే ఒకేసారి కలిపి ఐస్ క్రీం తినలేము, కాఫీ తాగలేము అనేసరికి రిషి ఐస్ క్రీమ్ తింటూ కాఫీ తాగుతూ రివర్స్ వసుకే ఎదురుదెబ్బ తగిలేలా చేస్తాడు. దాంతో వసు తను అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి అని అనుకుంటుంది.
మరోవైపు జగతి రిషి అన్న మాటలను, మహేంద్ర ను ఇంట్లోకి రావద్దన్న మాటలను తలుచుకొని బాధ పడుతుంది. అంతలోనే శిరీష్ వచ్చి తమ ప్రాజెక్టు గురించి అందులో ఉన్న విషయాల గురించి వివరించమని కోరుతాడు. వెంటనే మనసులో వసు వస్తే బాగుండు అని అనుకుంటుంది. ఇక వసు ఆటోలో ఇంటికి బయలుదేరగా ధరణి ఫోన్ చేసిందని ధరణి కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. రిషికి ఏమైనా చెప్పావా అని అడగటంతో వసు కి ఫోన్ వినిపించకపోవడంతో కట్ చేస్తుంది.
అంతలోనే రిషి రావడంతో రిషి వచ్చి ధరణి తో మాట్లాడతాడు. రిషి మాటలు విని వసు ఏం చెప్పలేదు అని అనుకుంటుంది. ఈ రోజు కాఫీ, ఐస్ క్రీమ్ తో ప్రయోగం చేశాను అని అనేసరికి వెంటనే ధరణి ఇదంతా వసు వల్ల జరిగిందా అని ప్రశ్నిస్తుంది. ఇక రిషి ధరణితో వసు గురించి ఎక్కువగా ఆలోచించకండి అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు శిరిష్ జగతి మాటలకు ఫిదా అవుతూ పొగుడుతాడు. అదే సమయంలో వసు కూడా వచ్చి మాట్లాడుతుంది. తరువాయి భాగం లో రిషి జగతి దగ్గరికి వచ్చి డాడీ ఎక్కడున్నారు అడిగేసరికి ఇక్కడికి రాలేదని జగతి అంటుంది. దీంతో జగతి మహేంద్ర ను ఇంటి నుంచి వెళ్లిపోమన్న విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడుతుంది.