https://oktelugu.com/

World Chess Championship 2024: డింగ్ లిరెన్ అక్కడ దొరికిపోయాడు.. గుకేష్ దానిని అందిపుచ్చుకున్నాడు.. సీన్ కట్ చేస్తే ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు..

అది 2023 సంవత్సరం.. ప్రపంచ చెస్ ఛాంపియన్.. చైనాకు చెందిన లిరెన్.. రష్యాకి చెందిన ఇయాన్ నెపోమ్నియా పోటీ పడుతున్నారు. అయితే ఆ మ్యాచ్ అస్థిరంగా సాగింది. ఆ మ్యాచ్ లో గుకేష్ విజయం సాధించాడు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 12, 2024 / 08:57 PM IST

    World Chess Championship 2024(1)

    Follow us on

    World Chess Championship 2024: అలా అస్థిరంగా సాగిన మ్యాచ్లో లిరెన్ విజయం సాధించి నాడు ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. సరిగ్గా ఈ ఏడాది తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ టోర్నీ సింగపూర్ వేదికగా జరిగింది. ఈసారి భారత్ నుంచి ప్రజ్ఞానంద లాంటి వారు వెళతారని అందరూ అనుకున్నారు. కాకపోతే గుకేష్ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. గత ఏడాది డిసెంబర్లో చెన్నై వేదికగా జరిగిన గ్రాండ్ మాస్టర్ టోర్నీలో గుకేష్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు.. ప్రజ్ఞా నంద నుంచి మొదలుపెడితే అమెరికన్ జోడి ఫాభియానో కరువానా, హికారు నక మూరా వంటి వారి దాకా ఓడించాడు. ఈ గెలుపు ద్వారా ప్రపంచ చెస్ చాంపియన్ ఫైనల్ కు దారులు బలంగా వేసుకున్నాడు.. 18 సంవత్సరాల వయసులోనే సరికొత్త చరిత్రను సృష్టించే దిశగా సింగపూర్ బయలుదేరాడు. సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్నీలో ఏకంగా చివరి గేమ్ దాకా అతడు ఆడాడు. అత్యంత బలమైన లిరెన్ ను ఓడించాడు. వాస్తవానికి 14వ గేమ్ తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగింది. లిరెన్ తన ఎత్తులను మరింత పదునుగా వేశాడు. తన గడులలో అత్యంత వేగంగా పావులను కదిపాడు. ఇది సహజంగానే గుకేష్ కు ఇబ్బంది కలిగించింది. అతనిపై ఒత్తిడిని పెంచింది. దీంతో మరోసారి లిరెన్ విజేతగాని నిలుస్తాడని అందరూ అనుకున్నారు. అయితే 14వ గేమ్ లో లిరెన్ అనుకోకుండా తప్పు చేశాడు. వేస్తున్న ఎత్తులో ఒక్కసారి గా ఉద్వేగానికి గురై పావును తప్పుగా వేశాడు. అది గుకేష్ కు అనుకోని వరం లాగా మారింది. దీంతో గుకేష్ ఎక్కడా తప్పు చేయకుండా తన జోరు కొనసాగించాడు. తద్వారా లిరెన్ ను ఆత్మ రక్షణలో పడేసాడు.. అది అంతిమంగా గుకేష్ కు బలం లాగా మారింది. దానిని చివరి వరకు గుకేష్ కొనసాగించాడు. అత్యంత ఉత్కంఠ మధ్య జరిగిన 14వ గేమ్ ను గెలిచి విజేతగా నిలిచాడు..

    ప్రారంభం నుంచి..

    ఈ టోర్నీ ప్రారంభం నుంచి గుకేష్ అంత సులభంగా గేమ్ లు గెలవలేదు. ప్రారంభంలో కొన్ని గేమ్ లు డ్రా చేసుకున్నాడు. మరికొన్ని గేమ్ లు ఓడిపోయాడు. కానీ ఎక్కడా కూడా తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. లిరెన్ కు ఏకపక్ష విజయాన్ని అందించలేదు. అతడికి వెన్ను చూపలేదు. తన స్థాయిలో ఆడుకుంటూ వెళ్లిపోయాడు. చివరికి విజయాన్ని సాధించాడు. వాస్తవానికి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ స్థాయిలో ప్రపంచ చష్ ఛాంపియన్ గెలిచిన ప్లేయర్ గా గుకేష్ నిలిచాడు. సరిగ్గా గత ఏడాది ఇదే సమయానికి క్యాండిడేట్స్ టోర్నీ ఆడుతున్న గుకేష్.. ఏడాది గడిచేలోపే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు. ప్రతి గేమ్ లో అద్భుతాన్ని ఆవిష్కరించకపోయినప్పటికీ.. తనదైన మార్క్ ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. అలాగని వెన్నుచూపకుండా గుకేష్ ఆట తీరు ప్రదర్శించాడు. అవసరమైనప్పుడు ఎత్తులు వేస్తూ.. క్లిష్టమైన సందర్భాల్లో ప్రత్యర్థిని చిత్తు చేస్తూ ముందుకు సాగాడు. మొత్తంగా ప్రపంచ చెస్ ఛాంపియన్ గా ఆవిర్భవించాడు. సింగపూర్ వేదికగా భారతీయ జెండాను రెపరెపలాడించాడు. 18 సంవత్సరాల వయసులోనే అద్భుతమైన ఖ్యాతిని అందుకొని… సరికొత్త రికార్డును సృష్టించాడు..గుకేష్ విజయం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు అతడిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.