CSK without Dhoni match analysis: ఐపీఎల్ ప్రారంభానికి ముందే చైన్నై జట్టుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. చైన్నై జట్టులో కీలక ఆటగాడు, ఐదుసార్లు చాంపియన్ గా నిలిపిన ధోని గాయం వల్ల కొద్ది రోజులపాటు టోర్నీకి దూరమయ్యాడు. ఇది చైన్నై జట్టుకు కోలుకోలేని షాక్. ధోని ఆడకపోయినా వికెట్ల వెనుకాల అతడు ఉన్నాడంటే కొండంత బలం. సలహాలు, సూచనలు ఇవ్వడంతో ధోనిని మించిన వారు లేరు.ధోని పరిస్థితి అలా ఉందంటే.. చెన్నై జట్టులో కీలక ఆటగాడు బ్రేవీస్ గాయపడ్డాడు. అతడు కూడా కొన్ని మ్యాచ్ లు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. అటు ధోని ఆడక పోవడం.. ఇటు బ్రేవిస్ దూరం కావడంతో చెన్నై జట్టు ఒకరకమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది.
చెన్నై జట్టు ఇలా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఇద్దరు ప్లేయర్ల మీద తీవ్రమైన భారం పడే అవకాశం కనిపిస్తోంది. కెప్టెన్ గైక్వాడ్ సమర్థవంతమైన ఆటగాడు అయినప్పటికీ.. అతడు తన ఇన్నింగ్స్ ప్రారంభంలో నిదానంగా మొదలు పెడతాడు. ఆ తర్వాత వేగం పెంచుతాడు. ఐపీఎల్ లో ఈ సూత్రం కొన్ని సందర్భాలలో మాత్రమే వర్కౌట్ అవుతుంది.
ఈ క్రమంలో చెన్నై జట్టు బ్యాటింగ్ భారం మొత్తం సంజు శాంసన్, శివం దుబే మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరిద్దరే ఆ జట్టు లో బ్యాటింగ్ కు మూల స్తంభాలుగా నిలుస్తారని అభిమానులు భావిస్తున్నారు. వీరితోపాటు ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్ ను ఆడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉర్విల్ పటేల్ కు కూడా చోటు దక్కుతుందని తెలుస్తోంది.
Also Read: ముంబై ఇండియన్స్ గెలవడానికి అంత పని చేసిందా.. వెలుగులోకి సంచలన నిజం
వికెట్ కీపర్, సూపర్ బ్యాటర్ కార్తీక్ శర్మ కు తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమని సమాచారం. కార్తీక్ ను చెన్నై యాజమాన్యం ఏకంగా 14.2 0 కోట్లకు కొనుగోలు చేసింది.
బౌలింగ్ భాగంలో చెన్నై జట్టు పట్టిష్టంగా కనిపిస్తోంది. హెన్రీ, ఓవర్టన్, ఖలీల్ అహ్మద్, కాంబోజ్ తో కూడిన పేస్ విభాగం సమర్థవంతంగా ఉంది. చెన్నై జట్టు తొలి మ్యాచ్ రాజస్థాన్ తో ఆడుతోంది కాబట్టి.. పై బౌలర్లు జైస్వాల్.. సూర్యవంశీ.. జూరల్.. హిట్ మేయర్ ను అడ్డుకుంటారని చెన్నై మేనేజ్మెంట్ భావిస్తోంది. నూర్ అహ్మద్.. అఖిల్ హుస్సేన్ స్పిన్నర్లుగా తమ పాత్రను పోషిస్తే చెన్నై జట్టుకు తిరుగు ఉండదు.