Amaravati legal status plan: అమరావతికి( Amravati capital ) చట్టబద్ధత దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై అమరావతి ఏకైక రాజధానిగా గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2014 విభజన చట్టాన్ని సవరిస్తూ.. అమరావతిని కదిలించలేని స్థితిలో చట్టబద్ధత తేవాలన్న ప్రయత్నంలో చంద్రబాబు సర్కారు ఉంది. అందుకే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం సైతం వీలైనంత త్వరగా ఈ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి.. ఓకే చేయించే ప్రయత్నంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియను ఢిల్లీ స్థాయిలో కీలక నేత ఒకరు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తో ప్రత్యుత్తరాలు జరుపుతూ.. వీలైనంత త్వరగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. ఆ వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వెంకయ్య నాయుడు సేవలను దీనికోసం ఉపయోగిస్తుండటం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రాష్ట్ర రాజధాని కి లేని చట్టబద్ధత అమరావతికి అత్యంత ఆవశ్యం అని కేంద్రానికి చెప్పడంలో వెంకయ్య నాయుడు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.
రాజ్యాంగబద్ధ పదవితో..
బిజెపిలో కీలక పాత్ర పోషించారు వెంకయ్య నాయుడు( venkaiah Naidu). కానీ రెండోసారి బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత అనూహ్య నిర్ణయాలు వచ్చాయి. అందులో భాగంగా వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారు. దీంతో రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్లిపోయారు వెంకయ్య నాయుడు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ఒకానొక దశలో ఆయన పేరు రాష్ట్రపతి పదవికి వినిపించింది. ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతి పదవులను అలంకరించడం చాలా సందర్భాల్లో చూసాం. అదే మాదిరిగా వెంకయ్య నాయుడుకు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ కేంద్ర పెద్దలు మాత్రం అనూహ్యంగా ద్రౌపది ముర్ముకు ఆ అవకాశం ఇచ్చారు. గిరిజన మహిళ కావడంతో జాతీయస్థాయిలో కలిసివచ్చే అంశంగా పరిగణించి అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించిన వెంకయ్యనాయుడు కార్యక్రమంలో రాజకీయాలు చేయలేకపోయారు. తెర వెనుక రాజకీయాల కు మాత్రమే పరిమితం అయ్యారు.
Also Read: పెళ్లయినవాడితో ప్రేమ.. జీవితం అర్ధాంతరం.. శరీరం ముక్కలు.. ఈమె జీవితం ఎందరికో గుణపాఠం
ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు
అయితే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత కూడా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతోంది. అమరావతికి వ్యతిరేక ప్రచారం అధికమైంది. ఈ నేపథ్యంలో చట్టబద్ధత అనే అంశం తెరపైకి వచ్చింది. కానీ సాంకేతికంగా ఈ రాష్ట్ర రాజధానికి కూడా చట్టబద్ధత కల్పించలేని విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు సీనియారిటీ కలిగిన వెంకయ్య నాయుడుకు ఈ పని అప్పగించారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులు, గత అనుభవాలను వెంకయ్య నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత అత్యంత ఆవశ్యం అని.. అందుకు మార్గాలను సైతం సూచించారు వెంకయ్య నాయుడు. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్లో చర్చించి ఆ మరుసటి రోజు పార్లమెంటులో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికైతే అమరావతి రాజధాని విషయంలో ఆది నుంచి అనుకూలంగా ఉంటూ వచ్చారు వెంకయ్య నాయుడు. ఇప్పుడు ఆయనే స్వయంగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో పాలుపంచుకుంటున్నారు. ఇది నిజంగా శుభ పరిణామం.