CSK vs Rajasthan IPL 2026: ఐపీఎల్ ఇప్పటి తోనే ముగిసిపోలేదు. చెన్నై జట్టు గ్రూప్ దశ నుంచే వెళ్లిపోలేదు. చెన్నై జట్టుకు ఐదుసార్లు విజేతగా నిలిచిన చరిత్ర ఉంది. గతంలో ఇలాంటి ఓటములను ఎదుర్కొని.. గట్టిగా నిలబడిన ఘనత ఆ జట్టుకుంది. అయితే ఎన్నడూ కూడా చెన్నై జట్టు ఇంతటి దారుణమైన ఓటమిని ఎదుర్కోలేదు. అది కూడా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో ఇంత చెత్త ప్రదర్శన చేయలేదు.
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయింది. బెంగళూరు చేతిలో పరాజయాన్ని మూట కట్టుకుంది. రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై కోల్ కతా ఓటమిపాలైంది. క్రికెట్ అన్నాక ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు. అయితే ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో హైదరాబాద్.. కోల్ కతా జట్ల గురించి ఈ స్థాయిలో విమర్శలు రావడం లేదు. ఎందుకంటే ఆ రెండు జట్లు బ్యాటింగ్లో అదరగొట్టాయి. ఫీల్డింగ్ పరంగా కూడా ఇబ్బంది లేదు. బౌలింగ్లో లోపాల వల్ల ఆ రెండు జట్లు ఓడిపోయాయి. అయితే బౌలింగ్ లోపాలను కాస్త సవరించుకుంటే ఆ రెండు జట్లకు వచ్చిన ఇబ్బంది లేదు.. పైగా ఐపీఎల్ లో సత్తా చూపించడానికి ఆ రెండు జట్లు సిద్ధంగా ఉన్నాయి.
చెన్నై విషయంలో మాత్రం ఇటువంటి మినహాయింపులు లేవు. ఎందుకంటే రాజస్థాన్ జట్టు చెన్నై జట్టుతో పోల్చి చూస్తే చాలా బలహీనమైనది. అటువంటి జట్టు బ్యాటర్లను వెనక్కి పంపించడానికి చెన్నై బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రాజస్థాన్ బౌలర్లు వీరవిహారం చేసిన చోట చెన్నై బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా బంతులను బ్యాట్ మీదికి విసిరి తమ నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు. ఫలితంగా రాజస్థాన్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్య వంశీ ఇవే వ్యాఖ్యలు చేశాడు. బంతి తమను ఇబ్బంది పెట్టలేదని.. తమను ఇబ్బంది పెట్టే విధంగా బంతులు వేయలేదని వ్యాఖ్యానించాడు. నేరుగా బ్యాట్ మీదకి బంతి వస్తే గట్టిగానే కొడతాను కదా అని చెన్నై బౌలర్లకు స్లిప్పర్ షార్ట్ లాంటి సమాధానం చెప్పాడు.
బౌలింగ్లో వీక్.. బ్యాటింగ్లో వీక్.. ఫీల్డింగ్ లో కూడా వీక్.. ఇలా అన్నిట్లో వీక్ వీక్ వీక్.. అందువల్లే చెన్నై జట్టు అంత దారుణమైన ఓటమిని ముట్టకట్టుకుంది. వాస్తవానికి ప్రారంభ మ్యాచ్లో గెలిస్తే అది విపరీతమైన సానుకూల దృక్పధాన్ని అందిస్తుంది. దానిని ఆసరాగా చేసుకొని తదుపరి మ్యాచులు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ తొలి మ్యాచ్లోనే ఇంత దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది అంటే చెన్నై జట్టు తదుపరి మ్యాచ్లలో ఎలా ఆడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. జట్టును ఇలా కూర్చిన వ్యక్తులకు దండం పెట్టాలని వ్యంగ్యంగా అంటున్నారు.