https://oktelugu.com/

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ వచ్చిన వేళా విశేషం బాగోలేదా?.. టీమిండియా కు ఏంటీ దారుణ ఓటములు..

ఐపీఎల్ లో కోల్ కతా జట్టుకు మెంటార్ గా గౌతమ్ గంభీర్ పనిచేశాడు. దాదాపు పది సంవత్సరాల అనంతరం కోల్ కతా జట్టును విజేతగా నిలపడంలో విజయవంతమయ్యాడు. అతనిలో ఆ తెగువ చూసి బీసీసీఐ టీమ్ ఇండియా కోచ్ పదవి ఆఫర్ చేసింది. పోటీ ఎంత ఉన్నప్పటికీ.. అతడికే ఏకపక్షంగా పదవిని కట్టబెట్టింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 30, 2024 / 01:36 PM IST

    Gautam Gambhir(1)

    Follow us on

    Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచ్ గా తన మార్క్ చూపించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. బౌలింగ్ కోచ్ నుంచి మొదలు పెడితే సహాయకుల వరకు తన వారిని నియమించుకున్నాడు. తన హయాంలో భారత్ శ్రీలంకలో పర్యటించింది. టి20 సిరీస్ ను వైట్ వాష్ చేసింది. కానీ వన్డే సిరీస్ విషయానికి వచ్చేసరికి తేడా కొట్టేసింది. 3 వన్డేల సిరీస్లో ఏమాత్రం ప్రభావం చూపించలేక పోగా.. 33 సంవత్సరాల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్ కోల్పోయింది. ఇది గౌతమ్ గంభీర్ కోచ్ పనితీరుకు మొదటి దెబ్బ. దీనిని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ ను మీడియా వైట్ వాష్ చేసింది. టి20 సిరీస్ కూడా గెలుచుకుంది. దీంతో గౌతమ్ గంభీర్ పై పాజిటివిటీ నెలకొంది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సీరీస్ ను టీమిండియా ఓడిపోయింది. మూడు టెస్టులను కూడా స్వదేశంలో కోల్పోయింది.

    అప్పటినుంచి..

    న్యూజిలాండ్ జట్టు చేతిలో వైట్ వాష్ కు గురైన తర్వాత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు చెలరేగాయి. భారతదేశ టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో వైట్ వాష్ కు గురికావడం ఇదే తొలిసారిగా.. న్యూజిలాండ్ జట్టుకు ఇదే తొలి టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం. వన్డేలో శ్రీలంక, టెస్టులలో న్యూజిలాండ్ గత రికార్డులను బద్దలు కొట్టడంతో గౌతమ్ గంభీర్ పై అన్ని వేళ్లు చూపించడం మొదలైంది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టు… న్యూజిలాండ్ జట్టు చేతిలో టీమిండియా ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికాలో టి20 సిరీస్ ఆడింది. ఆ సిరీస్ ను గెలిచింది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ టెస్ట్ మినహా.. మిగతా అన్ని మ్యాచ్లో టీమిండియా ఆట తీరు అత్యంత నాసిరకం. ఈ మాట అనడానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. అయితే గిల్, సుందర్, హర్షిత్ రాణా విషయంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్న గౌతమ్ గంభీర్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఉదారత చూపుతున్నాడు. ఇక గత రెండు సీజన్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. చివరికి బాక్సింగ్ డే టెస్టులోనూ విజయం సాధించింది. గౌతమ్ గంభీర్ కోచింగ్ సారథ్యంలో భారత్ ప్రస్తుత బాక్సింగ్ డే టెస్టు కోల్పోయింది. అంతేకాదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. అంటే గౌతమ్ గంభీర్ కోచింగ్ సారథ్యంలో టీమిండియా తనకు మాత్రమే సాధ్యమైన రికార్డులను ఒక్కొక్కటిగా కోల్పోవుకుంటూ వస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన వేళ బాగోలేదని.. అందువల్ల టీమిండియా ఓటములను ఎదుర్కొంటున్నదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.