Cristiano Ronaldo: మెస్సీ పేరు జపిస్తుంటే రొనాల్డో కు మండింది వైరల్ వీడియో

గురువారం రియాజ్ సీజన్ కప్ టోర్నీ సౌదీ అరేబియాలో జరిగింది. అల్_ హిలాల్, అల్_ నాసర్ జట్లు పరస్పరం పోటీపడ్డాయి. అల్_ నాసర్ జట్టు లో క్రిస్టియానో రొనాల్డో ఆడాడు.

Written By: Suresh, Updated On : February 9, 2024 5:10 pm

Cristiano Ronaldo

Follow us on

Cristiano Ronaldo: మన కళ్ళ ముందు మన ప్రత్యర్థిని పొగుడుతుంటే ఎలా ఉంటుంది? అలాంటి అనుభవమే ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు ఎదురైంది. వేలాదిమంది అభిమానుల సమక్షంలో ఫుట్ బాల్ ఆడుతుండగా “మెస్సీ మెస్సీ” అనే అరుపులు వినిపించడంతో ఒక్కసారిగా క్రిస్టియానో రొనాల్డో సహనం కోల్పోయాడు. ” నేను మెస్సీని కాదు..క్రిస్టియానో రొనాల్డో ను. ఫుట్ బాల్ ఆడుతున్నాను” అని ప్రేక్షకులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దీంతో ప్రేక్షకులు మరింత రెచ్చిపోయి మెస్సీ మెస్సీ అని మరింత దగ్గరగా అరవడం ప్రారంభించారు.. దీంతో రొనాల్డో సహనం మరింత కోల్పోయాడు. రొనాల్డో, మెస్సీ ఇద్దరూ దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారులు. 2009 నుంచి వీరిద్దరి మధ్య పోటీ ప్రారంభమైంది. 2018లో తారాస్థాయికి చేరుకుంది. వీరిద్దరూ రియల్ మాడ్రిడ్, బార్సిలోనా జట్లకు ఆడారు.. ప్రస్తుతం రొనాల్డో అరేబియాలోని ఆల్_ నాసర్ జట్టు తరఫున ఆడుతున్నాడు. మెస్సీ ప్రస్తుతం ఇంటర్ మయామి జట్టుకు ఆడుతున్నాడు.

గురువారం రియాజ్ సీజన్ కప్ టోర్నీ సౌదీ అరేబియాలో జరిగింది. అల్_ హిలాల్, అల్_ నాసర్ జట్లు పరస్పరం పోటీపడ్డాయి. అల్_ నాసర్ జట్టు లో క్రిస్టియానో రొనాల్డో ఆడాడు. అయితే రొనాల్డో కి వ్యతిరేకంగా అల్_ హిలాల్ అభిమానులు మెస్సి పేరును జపించడం మొదలుపెట్టారు.. అంతేకాదు రొనాల్డో ను ట్రోల్ చేశారు. సహనం కోల్పోయిన రొనాల్డో.. నేను మెస్సీని కాదు అంటూ అల్_ హిలాల్ అభిమానులపై ఎదురుదాడికి దిగాడు. అయితే చాలామంది రొనాల్డో భావోద్వేగాలకు అతీతంగా ఉంటాడు అనుకుంటారు.. కానీ అది తప్పు అని రొనాల్డో నిరూపించాడు. రియాజ్ సీజన్ కప్ లో అల్ హిలాల్ జట్టు పై అల్ నాసర్ 2_0 తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో అల్ హిలాల్ జట్టుపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఓటమిని తట్టుకోలేక క్రిస్టియానో రొనాల్డో అల్_ హిలాల్ స్కార్ఫ్ ను అతడు తన కాలిపై రుద్దాడు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది.

అల్_ నాసర్ తరఫున క్రిస్టియానో రొనాల్డో దాదాపు 90 నిమిషాల పాటు మైదానంలో ఆడాడు. అయితే అతడి నుంచి అద్భుతమైన ఆట నమోదు కాలేదు. నాలుగు షాట్లు ఆడినప్పటికీ.. గోల్స్ లభ్యం కాలేదు.. ఒక షాట్ గోల్ అవుతుందని అందరూ భావించినప్పటికీ అల్_ హిలాల్ కీపర్ యాసిన్ బౌనౌ అద్భుతమైన డైవ్ తో దాన్ని నిలువరించగలిగాడు. రొనాల్డో ఆఫ్ సైడ్ లో మూడుసార్లు క్యాచ్ కు గురయ్యాడు. ఆట 53 వ నిమిషంలో అల్_ హిలాల్ జట్టుకు ఫ్రీ కిక్ లభించింది. ఆ కోపంలో రొనాల్డో కోపంతో బంతిని తన్నడంతో మ్యాచ్ రిఫరీ అతడికి ఎల్లో కార్డు చూపించాడు. కాగా, ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ రౌండ్ ట్రోఫీలో భాగంగా అల్ నాసర్ జట్టు బుధవారం అల్ ఫీహా జట్టుతో తలపడుతుంది.