Cristiano Ronaldo Engagement: అతడు ఆడితే ఫుట్ బాల్ మైదానం తాండవం చేస్తుంది. అతడు కిక్ కొడితే ప్రత్యర్థి ఆటగాళ్ల వెన్నులో వణుకు పుడుతుంది. అతడు గట్టిగా బంతిని కాళ్లతో తంతే గోల్ఫ్ కోర్ట్ లో పడుతుంది. అందుకే అతని ఆట తీరును చూసేందుకు.. అతడు ఆడుతుంటే పరవశించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. అతడు మైదానంలో అడుగు పెడితే చాలు శివాలూగిపోతారు. అతని పేరే క్రిస్టియానో రోనాల్డో..
Also Read: మనిషివా.. ‘ట్రంప్’ వా?
పోర్చుగీస్ జాతీయ ఫుట్బాల్ జట్టు ఆటగాడిగా రోనాల్డో కొనసాగుతున్నాడు. ఇతడు ప్రస్తుతం అరేబియాలోని అల్ నాసర్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. ఆ క్లబ్ తరఫున ఆడుతున్నందుకు కనివిని ఎరుగని స్థాయిలో డబ్బును అందుకుంటున్నాడు. అతడు తన ప్రేయసి జార్జినా తో నిశ్చితార్థం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశాడు. రోనాల్డో 2016 నుంచి జార్జినా తో సహజీవనం చేస్తున్నాడు. వీరికి మొత్తం ఐదుగురు పిల్లలు. జార్జినా తో రోనాల్డో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. సరోగసి ద్వారా మరో ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. ప్రస్తుతం అతనికి ఐదుగురు సంతానం.
2016 నుంచి ఇప్పటివరకు జార్జీనాతో సహజీవనం చేస్తున్న రోనాల్డో.. తన బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా జార్జినాతో మిస్టర్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆమె చేతికి దొరికిన డైమండ్ రింగ్ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు..” ఇది ఆనందదాయకమైన విషయం. మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. జార్జినా తో నా బంధం మరో స్థాయికి వెళ్ళింది. మీరందరూ దీనిని ఆమోదిస్తారని అనుకుంటున్నాను. ఇది ఎంతో శుభ సందర్భం.. నాకెంతో నచ్చిన సమయమని” రోనాల్డో వ్యాఖ్యానించాడు.