Rinku Singh Government Job: రింకూ సింగ్ క్రికెటర్ గా 2022 ఐపీఎల్ సీజన్లో వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత షారుక్ ఖాన్ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. గత సీజన్లో ఐపీఎల్ లో అదరగొట్టాడు. కానీ ఈ సీజన్ లో మాత్రం తేలిపోయాడు. అతడిని భారీ ధరకు షారుక్ ఖాన్ జట్టు యాజమాన్యం రిటైర్డ్ చేసుకుంది. ఈ క్రమంలో వచ్చిన డబ్బుతో అతడు ఒక ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశం కూడా చేశాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన అతడు ఈ స్థాయికి ఎదగడం పట్ల అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి.. రింకు తండ్రి గ్యాస్ సిలిండర్ల డెలివరీ సంస్థలో పనిచేసేవాడు. ఇప్పటికీ అతడు అదే పని చేస్తున్నాడు. తన కొడుకు ఈ స్థాయికి రావడం పట్ల అతడు హర్షం వ్యక్తం చేశాడు. కష్టపడి జీవితంలో ఈ స్థాయికి వచ్చాడని వ్యాఖ్యానించాడు.
Also Read: గంభీర్ వచ్చిన తర్వాత.. టీమిండియా చెత్తగా, చిత్తుగా.. ఇలాంటి దారుణం మరే జట్టుకు లేదు భయ్యా!
ఇటీవల సమాజ్వాది పార్టీ ఎంపీ తో రింకు సింగ్ ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించాడు. ఖరీదైన హోటల్లో అత్యంత సన్నిహితుల మధ్య తన ఎంగేజ్మెంట్ వేడుక జరుపుకున్నాడు. వాస్తవానికి ఇటీవల అతని వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాలవల్ల అది వాయిదా పడింది. ఇక ఇప్పుడు రింకు సింగ్ కు సంబంధించిన వార్త మరొకటి వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రింకు సింగ్ ను ప్రాథమిక విద్యాధికారిగా నియమించింది. దీనిపై కొంతమంది సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. రింకు సింగ్ కేవలం 9వ తరగతి మాత్రమే చదివారని.. అలాంటి వ్యక్తిని ప్రాథమిక విద్యాధికారి గా నియమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 9వ తరగతి చదివిన వ్యక్తిని అధికారిగా నియమించడం విద్యను అ గౌరవించడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. తక్కువ తరగతి చదువుకున్నవారు ముఖ్యంగా పదవ తరగతి కూడా చదవలేని వారు ఆ పదవికి అనర్హులని వ్యాఖ్యానిస్తున్నారు..” రింకు సింగ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించాడు. ఇటువంటి వ్యక్తికి క్రీడా విభాగాన్నే కేటాయిస్తే బాగుండేది.. కానీ అతడికి ప్రాథమిక విద్యను కేటాయించారు. రింకు సింగ్ చదువుకున్నది కేవలం 9వ తరగతి మాత్రమే. అటువంటి వ్యక్తి అధికారిగా ఎటువంటి సేవలు అందిస్తారు? అటువంటి వ్యక్తికి ఆ ఉద్యోగం ఇవ్వడం కంటే స్పోర్ట్స్ కోటాలో క్రీడలకు సంబంధించిన ఉద్యోగం ఇస్తే బాగుండేదని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై యోగి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.