Stomach Cancer: ప్రస్తుతం క్యాన్సర్ అనే ప్రమాదకరమైన వ్యాధి రాజ్యమేలుతుంది. ఎవరికి ఎలాంటి క్యాన్సర్ వస్తుందో ఊహించడం కూడా కష్టమే. సడెన్ గా మంచిగా ఉన్న వ్యక్తి హాస్పిటల్ కి వెళ్తే క్యాన్సర్ అని తేలుతుంది. ఆ తర్వాత లైఫ్ మొత్తం మారిపోతుంది. అయితే ఎన్నో ప్రమాదకరమైన క్యాన్సర్ లలో ఒకటి కడుపు క్యాన్సర్. ఈ కడుపు క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. దాని లక్షణాలు ప్రారంభంలో కనిపించవు. అయితే, ఉదయం పూట దానిని గుర్తించడంలో సహాయపడే అనేక సంకేతాలు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం కనిపించే కొన్ని లక్షణాలపై శ్రద్ధ చూపడం వల్ల కడుపు క్యాన్సర్‌ను గుర్తిస్తే సకాలంలో చికిత్స చేయవచ్చు. మరి వాటిని ఎలా గుర్తించాలంటే?
మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు కడుపులో తేలికపాటి లేదా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారా? ఇది తగ్గకుండా కంటిన్యూఅ వుతుందా? అయితే అది కడుపు క్యాన్సర్, ముందస్తు సంకేతం కావచ్చు. ఈ నొప్పి తరచుగా కడుపు పైభాగంలో వస్తుంది. మంట లేదా భారంగా అనిపించవచ్చు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఈ నొప్పి ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య పదే పదే వస్తుంటే, వైద్యుడిని సంప్రదించి చెక్ చేయించుకోవడం అవసరం. అసలు లైట్ తీసుకోవద్దు.
Read Also: షిర్డి వెళ్తున్నారా? నియమాలు మార్చారు ఒకసారి చెక్ చేసుకోండి.
ఉదయం నిద్ర లేవగానే వికారం లేదా వాంతులు అనిపించడం కొందరు సాధారణం అనుకుంటారు. కానీ అసలు కాదు. కొన్ని సందర్భాల్లో కడుపు క్యాన్సర్‌లో, కణితి ఉండటం వల్ల కడుపు పొరలో చికాకు ఏర్పడుతుంది. దీని వలన ఉదయం వాంతులు వస్తాయి. కొన్నిసార్లు వాంతిలో రక్తం కూడా కనిపిస్తుంది. ఇలా మీకు కనిపిస్తే ఇది తీవ్రమైన లక్షణం అని గుర్తు పెట్టుకోండి. కడుపు క్యాన్సర్ ప్రారంభమైనప్పుడు, చాలా మందికి ఉదయం ఆకలి ఉండదు. మీకు అల్పాహారం తినాలి అనిపించడం లేదా? లేదంటే కొద్దిగా తిన్న తర్వాత కడుపు నిండినట్లు అనిపిస్తుందా? ఇదే కంటిన్యూ అవుతుంటే చెక్ చేసుకోవాల్సిందే.
ఉదయం తరచుగా త్రేనుపు రావడం, కడుపులో గ్యాస్ ఏర్పడటం లేదా అజీర్ణం వంటివి కూడా కడుపు క్యాన్సర్ కు కారణం కావచ్చు. ఈ లక్షణం తరచుగా సాధారణ జీర్ణ సమస్యలతో ముడిపడి ఉంటుంది. కానీ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, దానిని లైట్ తీసుకోవద్దు అని గుర్తు పెట్టుకోండి. ఎటువంటి ప్రయత్నం లేకుండా వేగంగా బరువు తగ్గడం, ఉదయం బలహీనంగా అనిపించడం కూడా కడుపు క్యాన్సర్ తీవ్రమైన లక్షణం కావచ్చు. నిజానికి, క్యాన్సర్ కణాలు మన శరీరం నుంచి చాలా శక్తిని ఉపయోగిస్తాయి. దీని వలన వేగంగా బరువు తగ్గవచ్చు. మరి జాగ్రత్త.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.