Director Sujeeth New Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కని గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయా స్టార్ హీరోలు ఇండియాలో నెంబర్ వన్ హీరోలుగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఆయా దర్శకులు సైతం హీరోలను నెంబర్ వన్ పొజిషన్లో నిలుపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) తో ఓజీ (OG) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తోంది. తద్వారా ఈ సినిమాతో ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు ఇండియాలో ఎవరికి దక్కనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ డైరెక్టర్లందరు గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంటే సుజిత్ (Sujeeth) సైతం ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇండియాలో ఎవరికి దక్కనటువంటి గొప్ప గుర్తింపును దక్కించుకోవడానికి ఆయన తీవమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత ఆయన మరో స్టార్ హీరోతో భారీ సినిమాని తెరకెక్కించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నానితో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ సినిమాని కంప్లీట్ చేసిన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ (Hruthik Roshan) తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉండటం వల్ల ఆయన బాలీవుడ్ హీరోలను డైరెక్షన్ చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ‘వార్ 2’ (War 2) సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తున్న హృతిక్ రోషన్ (Hruthik Roshan) ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటాడు.
ఇక దాంతో సుజిత్ కూడా హృతిక్ రోషన్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ఇక బ్యాక్ టు బ్యాక్ వరుస సక్సెస్ లను సాధించి స్టార్ డైరెక్టర్ గా మారతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…