Tirupati Cows Attack: రోడ్డుపై వెళ్తున్న వారిపై ఆవులు( cows ) దాడి చేసిన ఘటనకు సంబంధించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వీడియో వైరల్ అవుతోంది. తిరుపతిలో ఈ ఘటన జరిగినట్లు.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఉన్న ఓ వ్యక్తిపై ఆవులు సామూహికంగా దాడి చేయడం.. కాపాడే ప్రయత్నం చేసిన వ్యక్తులపై దాడి చేయడం వంటి దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. ఆవులే కదా అని తేలిగ్గా తీసుకుంటే ఇలానే చేశాయి అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేశారు. శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ దాడి జరిగినట్లు ఉంది. అయితే ఇది తిరుపతిలో జరిగిన ఘటన కాదని అధికారులు తేల్చి చెప్పారు.
* మహారాష్ట్రలో నాసిక్ లో..
అయితే ఇది ఫేక్ వీడియో కాదని.. మహారాష్ట్రలోని నాసిక్( Nashik ) లో జరిగినట్లు తాజాగా ప్రచారం నడుస్తోంది. అయితే సోషల్ మీడియాలో తిరుపతిని యాడ్ చేయడంతో ఇలా ప్రచారం జరిగింది. అయితే ఇది విపరీతంగా ప్రచారం కావడంతో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఇది తిరుపతిలో జరుగుతున్న ఘటన కాదని ధ్రువీకరించారు. అయితే ఇటీవల తిరుపతి చరిత్రను మసకబార్చేలా కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న కామెంట్స్ ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగా గుర్తు తెలియని వ్యక్తులు తిరుపతిలో అంటూ ప్రచారం చేశారని తెలుస్తోంది.
* ఎడిట్ చేసిన వీడియో
అయితే ఈ వీడియోలో( video) ఎడిట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా ఆవులు ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి పై దాడి చేశాయి. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు అలెర్ట్ అయ్యారు. అయితే వీడియోను నిశితంగా పరిశీలిస్తే ముందుగా విద్యార్థినులతో పాటు ఓ మహిళ అడ్డుకునేందుకు ముందుకు వచ్చారు. తరువాత వారు కనిపించకుండా మానేశారు. అటు తరువాత తోటి ప్రయాణికులు కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద కర్రలతో కొడుతున్న ఆవులు ముందుకు కదలక పోవడం విశేషం. అయితే ఇది ఫేక్ వీడియో అని ఎక్కువ మంది చెబుతున్నారు. కానీ మహారాష్ట్రలోని నాసిక్ లో ఈ ఘటన జరిగినట్లు మరో ప్రచారం ఉంది. మరి ఏది వాస్తవమో చూడాలి.