Vaibhav Suryavanshi vs Bumrah: బుమ్రా.. టీమిండియా ఏస్ బౌలర్. దూకుడుగా బంతులు వేస్తాడు. వేగంగా వికెట్లు తీస్తాడు. పరుగులు ఇవ్వడంలో పిసినారీతనాన్నీ ప్రదర్శిస్తాడు. ఏ కోణంలో కూడా బ్యాటర్ కు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కనీసం ఇవ్వడు. అందువల్లే అతడి బౌలింగ్లో ఆడాలంటే చాలామంది బ్యాటర్లు భయపడిపోతుంటారు.
అంతటి ప్రమాదకరమైన బుమ్రా బౌలింగ్లో 15 సంవత్సరాల బుడ్డోడు వైభవ్ సూర్య వంశీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. తాను ఎదుర్కున్న తొలి బంతిని సిక్సర్ కొట్టాడు. మొత్తంగా మంగళవారం గౌహతి వేదికగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్య వంశీ 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు. జైస్వాల్ 32 బంతుల్లో 77 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరి దూకుడు వల్ల రాజస్థాన్ జట్టు 11 ఓవర్లలోనే 150 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించడంలో ముంబై విఫలమైంది. 123/9 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సీజన్లో ముంబై జట్టుకు ఇది రెండవ ఓటమి.. ముంబై జట్టులో హార్దిక్ పాండ్యా మినహా ప్రతి బౌలర్ ఒక్కో ఓవర్ కు పది పరుగులకు మించి ఇచ్చారు. చాహర్, బౌల్ట్ వారు ఓవర్లలో 22 పరుగుల చొప్పున ఇచ్చారు. బుమ్రా తన తొలి ఓవర్లో 14 పరుగుల దాకా ఇచ్చాడు. ఆ తర్వాత రెండు ఓవర్లలో తొమ్మిది చొప్పున 18 పరుగులు ఇచ్చాడు. శార్దూల్ ఠాకూర్.. రెండు ఓవర్లలో 36 పరుగులు ఇచ్చాడు.. ఇంపాక్ట్ ఆటగాడు అల్లా ఘజన్పర్ 21 పరుగులు సమర్పించుకున్నాడు. పాండ్య మాత్రం 2 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి తన గౌరవాన్ని కాపాడుకున్నాడు.
ఈ సీజన్లో వరుసగా మూడో మ్యాచ్లో బుమ్రా ఒక వికెట్ కూడా తీయలేదు. టి20 కెరియర్లో బుమ్రా ఊహించని రికార్డు ఇది. గడిచిన 8 సంవత్సరాలలో ఒక వికెట్ కూడా తీయకుండా మూడు మ్యాచులు ముగించడం బుమ్రా కు ఇది తొలిసారి.. మొత్తం టి20 కెరియర్లో ఇది నాలుగవసారి. టి20 ల లో బుమ్రా 273 మ్యాచ్లు ఆడాడు. 6.92 ఎకనామి తో 345 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రకారం ఒకో మ్యాచుకు అతడు 1.26 వికెట్లు పడగొట్టినట్టు. 2016 సీజన్ లో వరుసగా మూడు ఐపీఎల్ మ్యాచ్లలో బుమ్రా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. తాజా 2026 సీజన్ మినహా.. 2017-18 సీజన్లో.. అంతకు ముందు 2014 సీజన్లో అతడు వికెట్లు సాధించలేదు.