Vaibhav Surya Vamsi: లక్నో జట్టు నాయకుడిగా రిషబ్ పంత్ కొనసాగుతున్నాడు. ఇతడు ప్రస్తుత ఐపీఎల్లో హైయెస్ట్ రిచెస్ట్ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. లక్నో జట్టు మేనేజ్మెంట్ 27 కోట్లకు ఇతడిని పర్చేజ్ చేసింది. కానీ లక్నో జట్టు అంచనా వేసిన విధంగా రిషబ్ పంత్ ఆడలేక పోతున్నాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్.. కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ సగటు 12.22 మాత్రమే అంటే అతడి బ్యాటింగ్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్ట్రైక్ రేట్ కూడా 98.21 గా ఉంది. దీంతో రిషబ్ పంత్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అతడు తన బ్యాటింగ్ స్టైల్ మార్చుకోవాలని సూచనలు పెరిగిపోతున్నాయి. విఫల ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో రిషబ్ పంత్ పలుమార్లు తన బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా మార్చుకున్నాడు. కొన్ని సందర్భాల్లో వన్ డౌన్ ఆటగాడిగా.. ఇంకొన్ని సందర్భాల్లో ఓపెనర్ గా.. మరికొన్ని సందర్భాలలో ఏడవ నెంబర్ ఆటగాడిగా వచ్చినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోతోంది. రిషబ్ పంత్ ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్ లలో ఒకే ఒకసారి ఆఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు అదే అతడి హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం.
Also Read: ఇవాళ ఓడిపోతే ఇంటికే..
పోలిక పెడుతున్నారు
నేటి సోషల్ మీడియా కాలంలో ఒక వ్యక్తితో మరో వ్యక్తిని పోల్చడం అనేది సర్వసాధారణం. పైగా క్రికెట్లో అయితే అది అత్యంత సర్వసాధారణం.. ఇక ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో.. రాజస్థాన్ ఆటగాడు సూర్య వంశీ వీర విహారం చేస్తున్న తరుణంలో.. రిషబ్ పంత్, సూర్యవంశీ మధ్య పోలిక పెడుతూ నెటిజన్లు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇందులో కొంత ఊహాజనితమైన సమాచారాన్ని కూడా వారు వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారు.. 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన రిషబ్ పంత్ విఫలమయ్యాడని.. 1.10 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సూర్య వంశీ విన్నింగ్ ప్లేయర్ అయ్యాడని.. ఇద్దరు ఎడమ చేతివాటం ఆటగాళ్ళేనని.. ఇలాంటి తరుణంలో సంజీవ్ గోయంకా బాధపడుతూనే ఉంటాడని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వారు చేస్తున్న ఈ వ్యాఖ్యల్లో ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే క్రికెట్ అనేది.. మరీ ముఖ్యంగా టి20 క్రికెట్ అనేది వేగంతో కూడుకున్న ఫార్మాట్. ఇందులో ఎంత స్పీడ్ గా పరుగులు చేస్తేనే జట్టుకు అంత లాభం ఉంటుంది. ఒక్కోసారి ఆటగాళ్లు వేగాన్ని అందుకోలేకపోవచ్చు. దానికోసం కొన్ని మ్యాచ్లు అవసరం పడవచ్చు. అంతమాత్రాన ఒక ఆటగాడు సెంచరీ చేశాడని.. ఇంకో ఆటగాడు పరుగులు చేయడం లేదని నిందించడం ఏమాత్రం సబబు కాదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యానాలను.. ఊహగానాలను వ్యాప్తిలోకి తీసుకురాకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి పనుల వల్ల ఆటగాళ్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని.. అది అంతిమంగా జట్ల విజయాల మీద ప్రభావం చూపిస్తుందని క్రికెట్ విశ్లేషకులు వివరిస్తున్నారు.