Pak Vs Ban Asia Cup: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ లాంటిది. ఆ ఆట ఆడుతున్నప్పుడు ప్లేయర్లు జెంటిల్మెన్ మాదిరిగానే వ్యవహరించాల్సి ఉంటుంది. అలాకాకుండా చిల్లర వేషాలు వేస్తే పరువు పోతుంది. అసలు ఇప్పుడు సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి అన్ని మాధ్యమాలలో నగుబాటుకు గురి కావలసి వస్తుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు పాకిస్తాన్ ఆసియా కప్ టోర్నమెంట్ లో ఎదుర్కొంటున్నది.
ఆసియా కప్ లో భాగంగా సూపర్ ఫోర్ విభాగంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నిన్న కీలకమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన బంగ్లాదేశ్ ఓటమితో తన ప్రస్తానాన్ని ముగించింది. అయితే పాకిస్తాన్ జట్టుకు ఏకపక్షమైన విజయాన్ని ఇవ్వకుండా బంగ్లా అదరగొట్టింది. వాస్తవానికి స్లాగ్ ఓవర్సులో ఒక బలమైన ఆటగాడు గనుక ఉండి ఉంటే బంగ్లాదేశ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. కీలకమైన ప్లేయర్లు వెంటవెంటనే అవుట్ కావడం.. బౌలర్లు తమ ప్రయత్నాన్ని కొనసాగించడంతో బంగ్లా పరువును కాపాడుకుంది. అయితే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తే.. పాకిస్తాన్ నిర్లక్ష్యం మరింత ప్రస్ఫుటంగా దర్శనమిచ్చింది. ముఖ్యంగా బంగ్లా ఆటగాడు హృదయ్ ను రన్ ఔట్ చేసే విషయంలో పాకిస్తాన్ ప్లేయర్ల కామెడీ బ్రహ్మానందం సినిమా సైతం మించిపోయింది.
బంగ్లా ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో.. పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది బౌలింగ్ వేశాడు. తొలి బంతిని హృదయ్ గట్టిగానే ఎదుర్కొన్నాడు. ఆ బంతి అతడి బ్యాట్ చివరి అంచుకు తగిలి బ్యాక్ వర్డ్ పాయింట్ వద్దకు వెళ్ళిపోయింది. పరుగు తీయడానికి నాన్ స్ట్రైకర్ గా ఉన్న సైఫ్ వేగంగా పరుగు తీస్తే వచ్చాడు. ఆ సమయంలో ఆయుబ్ చక్కటి ఫీల్డింగ్ చేశాడు. అతడు ఎడమవైపుకు డైవ్ చేసి బంతిని అద్భుతంగా ఆపాడు. అంతే వేగంగా బంతిని నాన్ స్ట్రైకర్ వైపు విసిరేశాడు. అయితే ఆ బంతిని అందుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. దీంతో సైఫ్ మళ్లీ వేగంగా వెనక్కి పరుగుపెట్టాడు. అతడు క్రీజ్ లోకి వచ్చేంతవరకు పాకిస్తాన్ ప్లేయర్లు అలానే చూస్తూ ఉండిపోయారు. ఆయుబ్ అంత చక్కటి ఫీల్డింగ్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. దీంతో అతడు ఒకసారిగా నిరాశ చెందాడు. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ అతడిని అనునయించాడు. వాస్తవానికి సింపుల్ గా తీయాల్సిన రనౌట్ ను పాకిస్తాన్ ప్లేయర్లు మిస్ చేసుకున్నారు. అంతేకాదు మైదానంలో కామెడీ పీసులుగా మిగిలిపోయారు. ఇటీవల కాలంలో ఒక జట్టు ప్లేయర్లు ఇంత దారుణంగా ఫీల్డింగ్ చేయడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.
View this post on Instagram