Vahana Mitra Scheme: ఏపీలో ( Andhra Pradesh)వాహన మిత్ర పథకానికి అంత సిద్ధం అయ్యింది. ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.15000 అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఇటీవల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మొత్తం ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఒక్కో ఆటో డ్రైవర్ కు 15 వేల రూపాయల చొప్పున నగదు జమ చేసేందుకు సిద్ధపడింది. ఇందుకు అక్టోబర్ 1 ముహూర్తంగా నిర్ణయించింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయగలిగింది. రవాణా శాఖ వద్దకు జాబితా వెళ్ళింది. మరోవైపు సచివాలయాల్లో వాహన మిత్ర లబ్ధిదారుల పేర్లను ప్రదర్శించనున్నారు.
3 లక్షలకు పైగా అర్హులు..
రాష్ట్రవ్యాప్తంగా వాహన మిత్ర( Vahan Mitra ) పథకానికి 3,10,385 మంది అర్హులుగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లు ఈ పథకం కింద అర్హులు. సొంత ఆటో కలిగి ఉండి.. ఏపీలో రిజిస్ట్రేషన్ అయిన వారు మాత్రమే అర్హులు. ఈ మేరకు గ్రామ/ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరించారు. విజయదశమి కి కానుకగా ఒకరోజు ముందుగానే అంటే.. అక్టోబర్ 1న ఆటో డ్రైవర్ల పదిహేను వేల చొప్పున జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
– వీరు మాత్రమే అర్హులు
– సొంత ఆటో కలిగి ఉండి డ్రైవింగ్ చేయాలి.
– ఏపీలో రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి.
– 3 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం ఉండాలి.
– ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు.
– సొంత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
– అటువంటి వారికి మాత్రమే వాహన మిత్ర అందుతుంది.