Lord’s Cricket Ground: క్రికెట్లో ఎన్నో మైదానాలు ఉన్నాయి. వాటికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. కానీ లార్డ్స్ మైదానం వేరు. లార్డ్స్ మైదానాన్ని క్రికెట్ మక్కా అని పిలుస్తుంటారు. ఈ మైదానానికి 200 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ప్రస్తుతం భారత్ గురువారం ఇంగ్లాండ్ జట్టుతో మూడవ టెస్ట్ లార్డ్స్ మైదానంలో ఆడుతోంది. ఈ మైదానంలో మ్యాచ్ గెలిచిన తర్వాత ఒకప్పటి టీమిండియా సారథి సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి గాల్లోకి తిప్పాడు. దీనినిబట్టి లార్డ్స్ మైదానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
లార్డ్స్ మైదానంలో గెలవడం కంటే.. ఆడటమే పెద్ద టాస్క్. ఈ మైదానం ఇప్పటివరకు 148 టెస్ట్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ మైదానం గ్రౌండ్ గ్రాండ్ స్టాండ్ వైపు ఒక విధంగా ఉంటుంది. టవెర్న్ వైపు మరొక విధంగా ఉంటుంది.. ఒక శిఖరం పాదాల వద్ద ఈ మైదానాన్ని నిర్మించారు. అందువల్లే ఇది 2.5 మీటర్ల వరకు వాలుగా కనిపిస్తుంది. వాస్తవానికి ఈ మైదానాన్ని ఒకే తీరుగా రూపొందించాలని ప్రతిపాదనలు గతంలో వచ్చినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చలేదు. మరోవైపు దీనికి మెరిల్బాన్ క్రికెట్ క్లబ్ ఒప్పుకోలేదు.
Also Read: లార్డ్స్ టెస్ట్.. హీట్ మొదలైంది.. ఈ వీడియో చూడండి
లార్డ్స్ మైదానం అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఆడాలి అని ప్రతి క్రికెటర్ కలగంటాడు. అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలి. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేవారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వేగంగా బంతులు వేసేవారు ఆచితూచి వేయాలి. ఈ మైదానంలో నర్సరీ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. బంతి కుడి చేతి బ్యాటర్ల నుంచి దూరంగా వెళ్తుంది. ఎడమ చేతి బాటర్లకు దగ్గరగా వస్తుంది. ఒకవేళ ఫైన్ లెగ్ నుంచి గాలి వీస్తే బ్యాటర్ ఇబ్బంది ఎదురు కావాల్సి ఉంటుంది.. ఈ మైదానం ఎంత విచిత్రంగా ఉంటుందంటే.. జేమ్స్ అండర్సన్ వంటి బౌలర్లు కూడా తమ లయను కోల్పోయేలా చేసింది. అందువల్లే అతడు తన కెరియర్ చివర్లో పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేశాడు. పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తే కుడి చేతి బ్యాటర్లకు లోపలికి బంతి వస్తుంది. ఈ మైదానంలో ఎడమ చేతి వాటం బౌలర్లు అద్భుతాలు చేశారు. సహజంగా లభించే స్వింగ్ ను ఈ మైదానం వాలు మరింత పదులు పెట్టే విధంగా చేస్తుంది. దీంతో బంతిని అంచనా వేయడం బ్యాటర్లకు ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు బ్యాటర్లు కచ్చితంగా స్పృహలో ఉండాలి. సరైన పొజిషన్లోనే క్రీజ్ లో ఉండాలి. పెవిలియన్ ఎండ్ వైపు నుంచి బంతులు వస్తే చాలు.. చాలామంది బ్యాటర్లు తమ వికెట్లను త్వరగానే సమర్పించుకుంటారు. ఈ మైదానం గత చరిత్ర కూడా అదే చెబుతోంది.
Test match mornings. pic.twitter.com/TtjZ06sxUO
— Lord’s Cricket Ground (@HomeOfCricket) July 10, 2025
ప్రస్తుత భారత జట్టులో చాలామంది కొత్త ప్లేయర్లు ఉన్నారు. వారికి ఒక రకంగా లార్డ్స్ స్లోప్ విచిత్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బౌలర్ల విషయంలో ఎలా వాడుకోవాలి అనే దానిపై సారధికి కచ్చితంగా స్పష్టత ఉండాలి. అందువల్లే భారత జట్టులోకి అర్ష్ దీప్ ను తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇక కీపర్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాలుతో వస్తున్నప్పుడు బంతి కదలిక అత్యంత వేగంగా ఉంటుంది. దానికి గాలి గనక తోడైతే ఇక చెప్పడానికి ఏమీ ఉండదు. ఒక బైస్ దూరం వెళ్లినా సరే పరుగులు వచ్చేస్తూనే ఉంటాయి. అందువల్లే కీపర్లు ఇక్కడ నర్సరీ ఎండ్ నుంచి కీపింగ్ చేస్తుంటారు. అంతేకాదు కుడివైపు కొంచెం దూరం జరుగుతారు.. పెవిలియన్ ఎండ్ లో ఉంటే ఎడమ చేతి వైపు అదనంగా కదులుతూ ఉంటారు. లార్డ్స్ మైదానంలో భారత్ – ఇంగ్లాండ్ 19 సార్లు పరస్పరం తలపడ్డాయి. భారత్ మూడుసార్లు గెలిచింది. ఇంగ్లాండ్ 12సార్లు విజయం సాధించింది. నాలుగు సందర్భాలలో మ్యాచ్ లు డ్రా గా ముగిశాయి.
Good morning.
It’s Test match time! pic.twitter.com/iiWFbKCqUm
— Lord’s Cricket Ground (@HomeOfCricket) July 10, 2025