KL Rahul Test Century 2025: రోమ్ నగరంలో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలి అంటారు. ఈ సామెతను నూటికి నూరు పాళ్ళు నిజం చేస్తున్నాడు టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul). ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రెండవ ఇన్నింగ్స్ లో టీం ఇండియాను ఒంటి చేత్తో కాపాడాడు కేఎల్ రాహుల్. సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. గిల్ సేన ను ఆదుకున్నాడు.
కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు. ఒకప్పటి లెజెండరీ ఆటగాడు ద్రావిడ్ శిష్యరికంలో రాటు తేలాడు. తద్వారా టెస్ట్ క్రికెట్లో అసలు సిసలైన ఆటగాడిగా ఆవిర్భవించాడు. అద్భుతమైన బ్యాటింగ్ అదే స్థాయిలో కీపింగ్ చేస్తూ అదరగొట్టాడు. ఇటీవల ఐపీఎల్లో కూడా ఆకాశమే హద్దుగా చెలగిపోయాడు. ఢిల్లీ జట్టుకు కీలక ఆటగాడిగా ఆవిర్భవించాడు. అందువల్లే అతడికి టెస్ట్ సిరీస్ లో చోటు లభించింది. వచ్చిన అవకాశాన్ని కేఎల్ రాహుల్ సద్వినియోగం చేసుకున్నాడు. ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ వెంట్రుక వాసిలో కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో సూపర్ సెంచరీ చేసి.. తను ఎంత స్పెషలో నిరూపించుకున్నాడు.
తోటి ప్లేయర్లతో విభిన్న భాషలు
కేఎల్ రాహుల్ విభిన్నమైన ఆటగాడు మాత్రమే కాదు.. విభిన్న శైలిలో మాట్లాడుతాడు కూడా. అతనికి దక్షిణాది భాషలు మాత్రమే కాదు.. మన దేశ రాజభాష అయిన హిందీ కూడా వచ్చు. ఈ భాషల్లో అతడు అనర్ఘళంగా మాట్లాడతాడు.. ఈ విషయం ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ద్వారా వెలుగులోకి వచ్చింది.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తమ లక్ష్యాలను తెలియకుండా ఉండాలంటే ఆటగాళ్లు రకరకాల సంకేతాలు ఇస్తారు. అయితే వాటి వల్ల కూడా ఇబ్బంది ఎదురవుతుందనుకుంటే తమ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టులో ఉన్న షోయబ్ బషీర్ కు హిందీ వస్తుంది. అలాంటప్పుడు హిందీలో మాట్లాడితే ఇబ్బంది ఎదురవుతుందని భావించిన కేఎల్ రాహుల్.. తనకు తెలిసిన భాషల్లో మాట్లాడాడు. సాయి సుదర్శన్ తో తమిళంలో సంభాషించాడు. రిషబ్ పంత్ తో భారతదేశంలో మాట్లాడే హిందీలో సంభాషించాడు.. కరుణ్ నాయర్ తో కన్నడలో సంభాషించాడు. ఇక గతంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డితో తెలుగులో సంభాషించాడు. ఇక బ్రాడ్కాస్టర్లతో ఇంగ్లీషులో సంభాషించాడు కేఎల్ రాహుల్.
Also Read: KL Rahul: సంజీవ్ గొయెంకా సార్.. మీరు మిస్సైంది ఆణిముత్యాన్ని!
సాధారణంగా మైదానంలో ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లకు, ఫీల్డర్లకు యుక్తులు తెలియకుండా ఉండేందుకు ఏదో ఒక రూపంలో సంకేతాలు ఇస్తుంటారు. అయితే కేఎల్ రాహుల్ మాత్రం సంకేతాలతో పాటు భాష కూడా మార్చుతూ ఉంటాడు.. ప్రత్యర్థి ఆటగాళ్లకు తమ వ్యూహాలు తెలవకుండా జాగ్రత్త పడుతుంటాడు. అందువల్లే టీమిండియా ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న సిరీస్ లో తొలి టెస్టులో అదరగొట్టింది. ఇంగ్లాండ్ ఎదుట భారీ స్కోర్ ఉంచింది. ఇంగ్లాండ్ ఎదుట భారత్ ఈ లక్ష్యాన్ని ఉంచడానికి ప్రధాన కారణం కేల్ రాహుల్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.