Indian batters history in England: ఇంగ్లాండ్ గడ్డమీద ఎలా ఆడతారు? ఇంగ్లాండ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారు? ఇంగ్లాండ్ బ్యాటర్లను ఎలా కట్టడి చేస్తారు? తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు మీడియాలో వీటి ఆధారంగానే కథనాలు ప్రసారమయ్యాయి. గత రికార్డులను పరిశీలించినా సరే టీమిండియా కు అంతగా అనుకూలంగా లేవు.
పైగా ఈసారి గిల్ నాయకత్వంలో టీమిండియా ఇంగ్లీష్ గడ్డమీద అడుగుపెట్టింది. ఒకరకంగా గిల్ కూడా ఆంగ్లేయుల మీద అంతగా ఆకట్టుకోలేదు. మూడు టెస్టులు ఆడినప్పటికీ అతడు చెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు చేయలేదు. పైగా ఈసారి జట్టులో రోహిత్ లేడు. అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ లేడు. సామర్థ్యం ఉన్న రవిచంద్రన్ అశ్విన్ కూడా లేడు. దీంతో జట్టుపై భారీ అంచనాలు ఏ మాత్రం లేవు. పైగా తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆంగ్లేయుల ముందు భారత బ్యాటర్లు తేలిపోతారని.. వారు ఏమాత్రం ఆకట్టుకోలేరని అందరూ అనుకున్నారు. అయితే వారందరి అంచనాలను భారత బ్యాటర్లు పటా పంచలు చేశారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, గిల్, రిషబ్ పంత్ అదరగొట్టారు. ఈ త్రయం శతకాలు చేసి సరికొత్త రికార్డులకు బాటలు వేసింది. అంతేకాదు ఆంగ్ల బౌలర్లను ఒక ఆట ఆడుకుంది.. ముఖ్యంగా నాలుగో వికెట్ కు రిషబ్ పంత్ – గిల్ జోడి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టును అత్యంత పటిష్టమైన స్థితిలో నిలిపింది.
Also Read: Shubman Gill vs Virat Kohli: కోహ్లీ స్థానానికి గిల్ న్యాయం చేస్తాడా?
23 సంవత్సరాల తర్వాత..
భారత జట్టులో ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఆసియా వెలుపల ఇది మూడవసారి.. 1986లో ఆస్ట్రేలియా జట్టుతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో సునీల్ గవాస్కర్, శ్రీకాంత్, మహేందర్ అమర్నాథ్ సెంచరీలు చేశారు. అప్పట్లో ఇది రికార్డుగా ఉండేది. 2002లో ఇంగ్లీష్ జట్టుతో హెడింగ్లి వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ శతకాలు సాధించారు. ఇక 2006లో వెస్టిండీస్ జట్టుతో గ్రాస్ హైలెట్ వేదికగా జరిగిన మ్యాచ్లో సెహ్వాగ్, రాహు ద్రావిడ్, మహమ్మద్ కైఫ్ సెంచరీలు చేశారు. 2025లో హెడింగ్లీ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో జైస్వాల్, గిల్, రిషబ్ పంత్ సెంచరీలు చేశారు.. దాదాపు 23 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ ఘనతను ఆవిష్కరించారు. ప్రస్తుతం టీమిండియా నాలుగు వికెట్ల కోల్పోయి 446 పరుగులు చేసింది.. జైస్వాల్ 101, గిల్ 147 పరుగులు చేశారు. రిషబ్ పంత్ 129* పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
23 సంవత్సరాల తర్వాత భారత ప్లేయర్లు ఈ ఘనతను అందుకోవడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.. ఈ స్థాయిలో ఆడటం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేయడం.. భారీ స్కోర్ దిశగా భారత్ వెళ్తుండడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. భారత్ సిరీస్ మొత్తం ఇలానే ఆడాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
ONE OF THE GREATEST CELEBRATION IN CRICKET – PANT pic.twitter.com/WwGqii9wFc
— Johns. (@CricCrazyJohns) June 21, 2025