Rishabh Pant Sixes: ఐపీఎల్ లో విఫలమయ్యాడు. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అటువంటి ఆటగాడిని ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. దీంతో మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఫామ్ లో లేని వ్యక్తికి జట్టులో చోటు ఎలా కల్పిస్తారంటూ అందరు విమర్శించారు. అయితే ఈ విమర్శలతో అతడు ఒకే ఒక ఇన్నింగ్స్ తో అత్యంత బలమైన సమాధానం చెప్పాడు.
సాధారణంగా టెస్ట్ మ్యాచ్ అంటే ఎవరైనా నిదానంగా బ్యాటింగ్ చేస్తారు. ఆచితూచి బంతులను ఎదుర్కొంటారు. చెత్త బంతులను మాత్రమే బౌండరీల వైపు తరలిస్తారు. ఇబ్బంది పెట్టే బంతులను ఏమాత్రం ముట్టుకోరు. అన్నిటికంటే ముఖ్యంగా సాహసాలకు ప్రయత్నించరు. అయితే రిషబ్ పంత్ మాత్రం సాహసమే శ్వాసగా సాగిపో అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు. అసలు ఆడుతోంది ఇంగ్లాండులోనా? ఇండియాలో నా? అనే అనుమానం కలిగిస్తున్నాడు. ఏమాత్రం భయపడకుండా.. ఏమాత్రం తడబడకుండా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆడుతున్నది టెస్టా? టి20 నా? అనే అనుమానం కలిగిస్తున్నాడు. భీకరమైన లైన్ అప్ ఉన్న ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ కథనం రాసే సమయం వరకు టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ 175 బంతుల్లో 133 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో రిషబ్ పంత్ ఆకట్టుకున్నాడు. లీడ్స్ మైదానంలో ప్రత్యర్థి బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఫీల్డర్లకు పరుగులు పెట్టే అవకాశం లేకుండా బంతులను నేరుగా బౌండరీల వైపు తరలించాడు. తద్వారా తనకు పూనకం వస్తే ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా చూపించాడు రిషబ్ పంత్.
Also Read: Rishabh Pant: రిషభ్ పంత్ కు భారీ జరిమానా విధించిన బీసీసీఐ
ఏకంగా రోహిత్ రికార్డుకు ఎసరు
సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్.. ఇప్పుడు ఏకంగా రోహిత్ శర్మ రికార్డుకు ఎసరు పెట్టాడు. ప్రస్తుత ఇన్నింగ్స్ లో అతడు ఆరు సిక్సర్లు కొట్టాడు. అతడి దూకుడు చూస్తుంటే మరిన్ని సిక్సర్లు కొట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే క్రమంలో అతడు అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రత్యేకంగా టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ రికార్డుకు ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ధోని రికార్డును అతడు బ్రేక్ చేశాడు. టెస్టులలో ధోని 78 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు ఆ రికార్డును రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. రిషబ్ అంత ఖాతాలో 79 సిక్సర్లు ఉన్నాయి. పంత్ కంటే ముందు రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ 88 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ కంటే ముందు స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ కొనసాగుతున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సర్లు కొట్టాడు. పంత్ దూకుడు చూస్తుంటే వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు కూడా బద్దలు కొట్టే అవకాశం లేక పోలేదు. మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లు తేలిపోతున్న నేపథ్యంలో రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. పరుగుల వరద పారిస్తూ టీమ్ ఇండియాకు భారీ స్కోర్ అందిస్తున్నాడు.
ONE OF THE GREATEST CELEBRATION IN CRICKET – PANT pic.twitter.com/WwGqii9wFc
— Johns. (@CricCrazyJohns) June 21, 2025