India England Test: రెండో టెస్టు జరిగిన ఎడ్జ్ బాస్టన్ లో టీమిండియా బౌలర్ ఆకాష్ దీప్ రెచ్చిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు సాధ్యం కాని రికార్డును కూడా అతడు సొంతం చేసుకున్నాడు. వాస్తవానికి ఈ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. అందువల్లే పరుగుల వరద పారింది. భారత్, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో.. ఇదే నిరూపితమైంది. టీమిండియా రెండవ ఇన్నింగ్స్ లోనూ పిచ్ బ్యాటర్లకు అనుకూలించింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక్కసారిగా పిచ్ ను మార్చేశాడు ఆకాష్. పదునైన బంతులు వేసి ఆదరగొట్టాడు. ఏకంగా 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు.. రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ మైదానంపై 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. టీమ్ ఇండియా సాధించిన గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
వాస్తవానికి ఇంగ్లాండ్ బౌలర్లు సొంతమైదానంపై అద్భుతంగా బౌలింగ్ వేస్తారు. సొంత మైదాలలో వారికి అద్భుతమైన రికార్డు ఉంది. కానీ ఆ బౌలర్లు కూడా తేలిపోయిన చోట ఆకాష్ అదరగొట్టడం నిజంగా అద్భుతం అని చెప్పాలి. బంతి పాతబడినప్పటికీ.. అతడు బౌన్సర్లు వేయడం.. యార్కర్లు సంధించడం గొప్ప విషయం అని చెప్పాలి. అందువల్లే అతడిని ఎదుర్కోవడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మేటి శ్రేణి బ్యాటర్లు కూడా అతడిని ఎదుర్కోలేకపోయారు. ఏకంగా నలుగురు ప్రధాన బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ అయ్యారంటే ఆకాష్ బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కచ్చితత్వమైన వేగంతో.. అదే స్థాయి బౌన్స్ తో అతడు వేసిన బంతుల గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుంది. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు టాప్ ఆర్డర్ ను అతడు తిప్పలు పెట్టిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది. ఆకాష్ 10 వికెట్ల ప్రదర్శన చేసిన తర్వాత అతడి పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. సీనియర్ ఆటగాళ్లు అతని బౌలింగ్ ను మెచ్చుకుంటున్నారు. అతడు టీమిండియా కు దొరికిన వజ్రమని కొనియాడుతున్నారు.
Also Read: మూత్రానికి కూడా పన్ను విధించిన రాజు.. ఎప్పుడు? ఎవరంటే?
ఆకాష్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగులు తీయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారని.. వికెట్ కాపాడుకోవడానికి కష్టపడ్డారని ఇంగ్లాండ్ మీడియా రాసింది. అతడి బంతులు బుల్లెట్ల మాదిరిగా దూసుకు వచ్చాయని.. మిసైల్స్ మాదిరిగా మీద పడ్డాయని వ్యాఖ్యానించింది. అతని బౌలింగ్లో ఏదో మహత్తు ఉందని.. గొప్పగా రాటు తేలిన తర్వాత అతడు ఈ స్థాయిలో బౌలింగ్ వేసి ఉంటాడని ఆస్ట్రేలియా మీడియా వ్యాఖ్యానించింది.
ఇక ఈనెల పది నుంచి భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ జరుగుతుంది. లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమ్ ఇండియా బౌలర్ ఆకాష్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా టెన్నిస్ బాల్ తో అతడు క్రికెట్ ఆడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అతను టెన్నిస్ బాల్ తో ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. అతడి బౌలింగ్లో పరుగులు తీయడానికి బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. ముఖ్యంగా అతడు వేస్తున్న యార్కర్లు బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇలా ప్రాక్టీస్ చేసి ప్లాట్ పిచ్ పై ఆకాష్ వికెట్లు పడగొట్టాడు. ” ఆకాష్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. అందువల్లే ఇలాంటి బంతులు అతడి నుంచి వస్తున్నాయి. మామూలుగా అయితే ఇటువంటి ప్రదర్శన బుమ్రా లేదా సిరాజ్ నుంచి ఆశించేవాళ్లం. కానీ సిరాజ్ కు మించి బౌలింగ్ వేసి రెండో టెస్టు భారత వైపు వెళ్లేలా చేశాడు ఆకాష్. అతడికి ఎడ్జ్ బాస్టన్ మైదానం ఎప్పటికీ గుర్తుంటుందని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.