Uddhav-Raj Thackeray reunion : మహారాష్ట్రలో మరాఠీయేతరుల మీద దాడులు జరుగుతున్నాయి. కొట్టడం.. తిట్టడం.. నానా బీభత్సం జరుగుతోంది. బాల్ థాక్రే సోదరుడి కుమారుడే రాజ్ థాక్రే. శివసేన ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇద్దరూ కలిసిపోయారు. ఇద్దరూ కలిసిపోయి హిందీ వాసులను కొడుతున్నారు.
శివసేన పుట్టుకనే దీంతో మొదలైంది. మరాఠీ ఉన్మాదంతో దక్షిణ భారతీయులను ముఖ్యంగా తమిళలను తరిమేయడంతోనే వీరి పార్టీ పుట్టింది. కుర్చీ అధికారం కోసం మరాఠీ భాష హిందుత్వ ఎజెండాను ఎంచుకున్నారు. హిందుత్వ ఎజెండాతో వీరు మహారాష్ట్ర అంతటా విస్తరించింది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంట్రీ ఇచ్చి హిందూత్వాన్ని మహారాష్ట్రలో హైజాక్ చేసింది. దీంతో శివసేనకు ప్రజాదరణ తగ్గిపోయింది.
దీంతో శివసేన కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత వీరి కూటమి చీలిపోయింది. శివసేన చీలిపోవడంతో ఉద్దవ్ ఠాక్రే ఒంటరయ్యాడు. దీంతో రాజ్ థాక్రేతో ఉద్దవ్ కలిసి ఇప్పుడు ముంబైలో ఎన్నికల కోసం కష్టపడుతున్నారు. దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి..
మతపరంగా చూస్తే 66 శాతం హిందువులు , ముస్లిం లు 21 శాతం, బుద్దులు, జైనులు, సిక్కులు, పార్శీలు 10 శాతం లోపే ఉన్నారు. భాషపరంగా మరాఠీలు కేవలం 35 శాతం ఉన్నారు. హిందీ 25 శాతం, ఉర్దూ 12, గుజరాతీ 12, తమిళం 2.3 శాతం , తెలుగు 1.6 శాతం చొప్పున ఉన్నారు. నాన్ మరాఠీ మాట్లాడేవారు 65 శాతానికి పైగా ఉన్నారు.
రాజ్ ఠాక్రే దూకుడుతో ముంబాయి పీఠం ఉద్దవ్ ఠాక్రే చేజారిపోతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
