funny cricket moments viral: క్రికెట్ ఆడే జట్లు ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నప్పటికీ.. కామెడీ క్రికెట్ ఆడే జట్టు మాత్రం ఒకటి ఉంది. ఆ జట్టు పేరు పాకిస్తాన్. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఆ జట్టులో ఆటగాళ్లు ఎప్పుడూ ఎలా ఆడతారో ఎవరికి తెలియదు. బలమైన ఆస్ట్రేలియాను ఓడిస్తారు. అదే సమయంలో అనామక అమెరికా చేతిలో ఓడిపోతారు. ఒకానొక సందర్భంలో మైదానంలో పరుగుల వరద పారిస్తారు. అదే సమయంలో స్వల్ప పరుగులకే చాప చుట్టేస్తారు. అత్యంత అనిచ్చితికరమైన ఆట తీరుకు పాకిస్తాన్ ప్లేయర్లు పెట్టింది పేరు. అయితే గత కొంతకాలంగా ఆ జట్టు ఆటగాళ్ల ఆట తీరు ఏమాత్రం బాగుండడం లేదు. స్వదేశంలో వరుసగా ఓటములు ఎదుర్కొంటున్నారు. విదేశాలలో సైతం అదే తీరుగా ఆటను ఆడుతున్నారు. దీంతో ఆ జట్టు ప్లేయర్లను తట్టుకోలేక చాలామంది కోచ్ లు తమ కొలువులకు రాజీనామా చేశారు. పాకిస్తాన్ లాంటి దిక్కుమాలిన దేశానికి కోచ్ గా ఉండలేమని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్లేయర్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అసలు ఆ జట్టులో క్రమశిక్షణ ఉండదని.. మేనేజ్మెంట్ కు పద్ధతి పాడూ ఉండదని విమర్శించారు. ఆయనప్పటికీ పాకిస్తాన్ జట్టు మారదు. ఆ జట్టులో ఉన్న ఆటగాళ్ల తీరు అస్సలు మారదు.
Also Read: BCCI: పాక్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ.. దాయాది దేశానికి ఎంత కష్టం!
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో పాకిస్తాన్ ప్లేయర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. బహుశా అది టెస్ట్ మ్యాచ్ అనుకుంటా. అందులో ప్రత్యర్థి జట్టు బౌలర్ బౌలింగ్ వేశాడు. పాకిస్తాన్ ఆటగాడు దానిని గట్టిగా కొట్టాడు. బంతి బౌండరీ లైన్ వద్ద ఆగిపోయింది. అప్పటికే పాకిస్తాన్ ప్లేయర్లు క్విక్ త్రిబుల్ తీశారు. మరో పరుగు కోసం ప్రయత్నిస్తుండగా ఎందుకనో ఆగిపోయారు. ఇద్దరు బ్యాటర్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇదే దశలో ప్రత్యర్థి ఫీల్డర్ ఆ బంతిని వికెట్ కీపర్ వైపు విసిరేశాడు. మరో మాటకు తావు లేకుండా వికెట్ కీపర్ వికెట్ ను పడగొట్టాడు. దీంతో పాకిస్తాన్ బ్యాటర్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. వాస్తవానికి క్విక్ త్రిబుల్ తీసిన తర్వాత.. ఇద్దరు బ్యాటర్లు బంతి వికెట్ కీపర్ చేతుల్లోకి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ ఇద్దరు ఆటగాళ్లు క్రీజ్ బయటికి వచ్చి చర్చించుకోవడం.. బంతి కీపర్ చేతిలో పడటం.. అతడు వికెట్ ను పడగొట్టడంతో అవుట్ అయ్యాడు. బహుశా క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి రన్ అవుట్ జరిగి ఉండదు. అందువల్లే పాకిస్తాన్ ప్లేయర్లు అభాసుపాలవుతుంటారు. చెత్త ఆటతో తమ పరువు తామే తీసుకుంటారు. ఈ వీడియోలో కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు అలానే ఆడి సోషల్ మీడియాలో నవ్వుల పాలవుతున్నారు.
Pakistani batsmen thought the ball has reached the boundary and started chit chat before losing a wicket. pic.twitter.com/l9lksZq6iX
— Silly Point (@FarziCricketer) October 18, 2018