LSG Vs DC: ఐపీఎల్ లో హై వోల్టేజ్ మ్యాచ్.. రెండు జట్లకూ జీవన్మరణ సమస్యే..

క్రితం మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఢిల్లీ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది.. రిషబ్ పంత్ నిషేధం ఎదుర్కోవడంతో ఆ మ్యాచ్ కు అక్షర్ పటేల్ నాయకత్వం వహించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 14, 2024 11:14 am

LSG Vs DC

Follow us on

LSG Vs DC: ఐపీఎల్ లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. మ్యాచ్ పరంగా చూస్తే ఈ రెండు జట్లకు ఇది అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రెండు జట్లు క్రితం మ్యాచ్లలో వాటి ప్రత్యర్థుల చేతిలో దారుణంగా ఓడిపోయాయి. ఈ క్రమంలో ఈ మ్యాచ్లో విజయాన్ని దక్కించుకునేందుకు రెండు జట్లు కూడా చివరి వరకు పోరాడే అవకాశం ఉంది.

క్రితం మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఢిల్లీ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది.. రిషబ్ పంత్ నిషేధం ఎదుర్కోవడంతో ఆ మ్యాచ్ కు అక్షర్ పటేల్ నాయకత్వం వహించాడు. రిషబ్ పంత్ లేని లోటు ఆ మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. ఫలితంగా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో ఆ జట్టు విఫలమైంది. ఫలితంగా 47 పనుల తేడాతో దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.. సొంత మైదానంలో ఆడుతున్న నేపథ్యంలో.. కచ్చితంగా గెలవాలని ఢిల్లీ జట్టు భావిస్తోంది.. ఢిల్లీ బ్యాటింగ్ ఫ్రేజర్, వార్నర్, పంత్ పైనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఢిల్లీ జట్టు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.

లక్నో జట్టు అంతకుముందు హైదరాబాద్ జట్టుతో ఆడిన మ్యాచ్లో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది.. ఆ మ్యాచ్లో ఓడిపోవడంతో రాహుల్ పై లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయేంకా బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ లక్నో జట్టు నుంచి తప్పుకుంటాడని వార్తలు వినిపించాయి. మంగళవారం ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్లో అతడు కెప్టెన్ గా వ్యవహరిస్తాడా అనేది కూడా అనుమానంగానే ఉంది. అయితే అతడి కెప్టెన్ గా కొనసాగుతాడా లేదా అనే విషయం పట్ల ఇంతవరకూ లక్నో జట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. లక్నో జట్టు ఆటగాళ్లు హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో తేలిపోయారు. ఈ మ్యాచ్లో కూడా అదే ఆటతీరు కొనసాగిస్తే మాత్రం మరో ఓటమి తప్పదు. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. లక్నో జట్టు రాహుల్, క్వింటన్ డికాక్, స్టోయినీస్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.. కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని టచ్ లోకి రావాలని యోచిస్తోంది.. బౌలింగ్ భాగంలో కృష్ణ గౌతమ్, రవి బిష్ణోయ్ నుంచి మెరుపులు ఆశిస్తోంది.

ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు ఢిల్లీ జట్టు 13 మ్యాచులు ఆడగా, ఆరు విజయాలు సాధించింది.. 12 పాయింట్లతో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. ఇక లక్నో జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడి, ఆరు విజయాలు అందుకుంది..నెట్ రన్ రేట్ విషయంలో లక్నో జట్టు కంటే ఢిల్లీ మెరుగ్గా ఉండడంతో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో మూడుసార్లు విజయాన్ని అందుకుంది. ఢిల్లీ ఒకసారి విజయాన్ని దక్కించుకుంది. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం ఢిల్లీ జట్టుకు గెలిచే అవకాశాలు 54 శాతం, లక్నో జట్టుకు 46% ఉన్నాయి.

జట్ల అంచనా

జేక్ ఫ్రేజర్, స్టబ్స్, అక్షర్ పటేల్, రసిక్ సలాం, నవీన్ ఉల్ హక్, కులదీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, రిషబ్ పంత్, పూరన్, హోప్/ ముఖేష్ కుమార్.

ఇంపాక్ట్ ఆటగాళ్లు: లలిత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ప్రవీణ్ దుబే, కుమార్ కుషాగ్రా, సుమిత్ కుమార్.

లక్నో

క్వింటన్ డికాక్, ఆర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, దీపక్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, యశ్ రవి సింగ్ ఠాకూర్.

ఇంపాక్ట్ ప్లేయర్స్: దేవ దత్ పడిక్కల్, యు ధ్ వీర్ సింగ్, అమిత్ మిశ్రా, అష్టన్ టర్నర్.