Cricket Stadium Rules: క్రికెట్ మనదేశంలో ఒక మతం లాంటిది. క్రికెట్ కనక ఒక మతం అయితే మన దేశంలో అదే మొదటి స్థానంలో ఉండేది. దీనిని బట్టి క్రికెట్ కు మనదేశంలో ఎంతటి క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ ను చూస్తాం. క్రికెటర్లను ప్రేమిస్తాం. క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోతే ద్వేషిస్తాం. అంతిమంగా క్రికెట్ తోనే ప్రయాణం సాగిస్తాం. అందువల్లే బిసిసిఐ ప్రపంచ క్రికెట్లో అత్యంత ఖరీదైన బోర్డుగా కొనసాగుతోంది. ఏకంగా ప్రపంచ క్రికెట్ నే శాసిస్తోంది. ప్రస్తుతం ఐసీసీకి వస్తున్న మెజారిటీ ఆదాయం మొత్తం బిసిసిఐ చలవే. బీసీసీఐ కేవలం ఐసీసీకి మాత్రమే కాదు చాలా దేశాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదాయాన్ని కల్పిస్తోంది.
క్రికెట్ ఒకప్పుడు కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఐసీసీ తీసుకొచ్చిన నిబంధనల వల్ల క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. అమెరికా లాంటి దేశంలో కూడా వరల్డ్ కప్ టోర్నీలు నిర్వహిస్తోంది. తద్వారా అక్కడ కూడా క్రికెట్ విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. కేవలం అమెరికానే కాకుండా ఇతర దేశాలలో కూడా క్రికెట్ ను విస్తరించేందుకు ఐసీసీ అనేక పనులు చేపడుతోంది. ఇక తాజాగా ఇతర దేశాలలో యుద్ధ ప్రాతిపదికల మైదానాలు ఏర్పాటు చేస్తోంది.
Also Read: జట్టులోకి బుమ్రా ఎంట్రీ.. అతడికి రెస్ట్.. మూడో టెస్ట్ ముందు ఇదేం ట్విస్ట్
సాధారణంగా క్రికెట్ అనేది అవుట్ డోర్ స్టేడియంలో మాత్రమే అవుతారు. ఇండోర్ స్టేడియంలో క్రికెట్ ఆడే అవకాశం ఉండదు. ఎందుకంటే పిచ్, అవుట్ ఫీల్డ్, భారీగా వచ్చే అభిమానులకు ఇండోర్ స్టేడియం ఏ మాత్రం సరిపోదు. పిచ్, బౌలింగ్లో స్వింగ్, సీమ్, వాతావరణం ఆధారంగానే అందులో పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. కొన్ని దేశాలలో ఇండోర్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. వాటి నిబంధనలు చిత్రంగా ఉంటాయి. అయితే ఐసీసీ అధికారికంగా ఇప్పటివరకు ఇండోర్ మ్యాచులు నిర్వహించలేదు. నిర్వహించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇండోర్ లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తే.. ఒకవేళ బ్యాటర్లు కొట్టే బంతులు పై కప్పును తగిలితే.. దానిని ఎలా పరిగణించాలనే విషయంపై ఐసీసీకి ఇంతవరకు ఒక క్లారిటీ లేదు.
ఇండోర్లో క్రికెట్ మ్యాచ్లు చూస్తే మజా రాదు. పైగా బౌలర్లు చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బంతులు వేస్తుంటారు. బ్యాటర్లు కూడా బలం మొత్తం ఉపయోగించి బంతిని కొడుతుంటారు. అలాంటప్పుడు అవుట్ డోర్ స్టేడియంలో అయితేనే బాగుంటుంది. ఇండోర్లో ఇటువంటి మ్యాచ్లు నిర్వహించడం సాధ్యం కాదు. ఒకవేళ నిర్వహించినప్పటికీ.. అభిమానులకు అంతగా అనుభూతి రాదు. ఆటగాళ్లకు కూడా ఆడినట్టు అనిపించదు. ఇండోర్ గేమ్ లు ఇండోర్లోనే ఆడించాలి. అవుట్ డోర్ గేమ్ లు అవుట్ డోర్ స్టేడియంలోనే ఆడించాలి. అంతేతప్ప ఇండోర్ మైదానాలలో క్రికెట్ ఆడిస్తే ఆడే వాళ్లకు చిరాకు కలుగుతుంది. చూసేవాళ్ళకు విరక్తి వస్తుంది. అందు గురించే సాధ్యమైనంతవరకు క్రికెట్ మ్యాచ్ లో నిర్వహణ విషయంలో నిబంధనలు పాటిస్తే చూసేవాళ్ళకు బాగుంటుంది. ఆడే వాళ్లకు ఇంకా అంతకంటే బాగుంటుంది.