Ramayana makers earned 1000 crores:రణబీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణం’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలై సంచలనం సృష్టించాయి. ఇక జూలై 3న రామాయణం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. సినిమాలో వరుసగా శ్రీరాముడు, లంకాపతి రావణుడి పాత్రలు పోషించిన రణబీర్ కపూర్, యష్‌లను మొదటి గ్లింప్స్ లోనే చూపించారు. ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నిర్మాత నమిత్ మల్హోత్రా. నితేష్ తివారీ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియో బ్యాంక్రోల్ చేసింది. అంటే ఆర్థికంగా అన్నమాట. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రాగానే నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియో చాలా లాభాలను పొందింది. అంతేకాదు సినిమా విడుదలకు ముందే, స్టాక్ మార్కెట్‌లో స్టూడియో సంపద ఓ రేంజ్ కు చేరుకున్నట్టు టాక్. జస్ట్ ఈ సినిమా టీజర్ కారణంగా, ప్రైమ్ ఫోకస్ స్టూడియో మార్కెట్ క్యాప్‌లో భారీ పెరుగుదల వచ్చిందటే అర్థం చేసుకోండి.
ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో చేరింది. జస్ట్ కంపెనీ బోర్డు 462.7 మిలియన్ ఈక్విటీ షేర్లను జారీ చేసిన వెంటనే భారీ లాభాలను ఆర్జించింది. దీనితో జూన్ 25, జూలై 1 మధ్య కంపెనీ షేర్ ధర 30% పెరిగింది. ఒక్క షేరు ధర ఏకంగా రూ.113.47 నుంచి రూ.149.69కి పెరిగింది. దీంతో ఈ రామాయణం ఫస్ట్ లుక్ నమిత్ మల్హోత్రా నేతృత్వంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌కు భారీ లాభాన్ని ఆర్జించి పెట్టింది అన్నమాట.
రామాయణం విడుదలకు ముందే భారీ లాభాలు
కొన్ని రోజులుగా రామాయణం టీజర్ గురించి చాలా చర్చలు జరిగాయి. జూలై 1 తర్వాత, సినిమా ఫస్ట్ గ్లింప్స్ తేదీ దగ్గర పడుతుండగా, ప్రైమ్ ఫోకస్ స్టాక్ కూడా ఒక్కసారిగా పెరిగింది. జూలై 3న, అంటే రామాయణం టీజర్ లాంచ్ అయిన రోజున, ప్రైమ్ ఫోకస్ స్టాక్ రూ.176కి చేరుకుంది. దీనితో, జూలై 1న కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4638 కోట్ల నుంచి రూ.5641 కోట్లకు పెరిగింది. దీనితో, ‘రామాయణం’ నిర్మాతలు సినిమా విడుదలకు రెండు రోజుల్లోనే తమ హోల్డింగ్‌లో రూ.1000 కోట్ల పెరుగుదలను చూశారు. మార్కెట్ ముగిసే సమయానికి, షేర్ ధర రూ.169కి తగ్గింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5200 కోట్లకు చేరుకుంది.
Also Read: పూజ హెగ్డే ని దారుణంగా అవమానించిన తమిళ హీరో ధనుష్..పరువు మొత్తం పొయ్యిందిగా!
‘రామాయణ్’ స్టార్ రణబీర్ కపూర్ కూడా రామాయణ్ నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌లో పెట్టుబడి పెట్టబోతున్నారని టాక్. కొత్త షేర్ల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందట కూడా. ఈ రణబీర్ కంపెనీకి చెందిన 1.25 మిలియన్ షేర్లను కొనుగోలు చేస్తారని బిజినెస్ స్టాండర్డ్ నివేదించిందని సమాచారం. రణబీర్ ఈ షేర్లను ఏ ధరకు కొనుగోలు చేస్తారో తెలియదు. కానీ వాటి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం, అతని పెట్టుబడి విలువ దాదాపు ₹20 కోట్లు ఉంటుందని అంచనా.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.