Homeక్రీడలుక్రికెట్‌Cricket Game Changes: ఆ ఒక్క మ్యాచ్.. క్రికెట్ లో పెను మార్పులకు నాంది పలికింది..

Cricket Game Changes: ఆ ఒక్క మ్యాచ్.. క్రికెట్ లో పెను మార్పులకు నాంది పలికింది..

Cricket Game Changes: ప్రస్తుతం క్రికెట్లో అనేక రకాల నిబంధనలు ఉన్నాయి. టెస్ట్, వన్డే, టి20 ఫార్మాట్లతో క్రికెట్ అద్భుతమైన క్రీడగా వెలుగొందుతోంది. అంతేకాదు క్రికెట్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు కొన్ని దేశాలకే పరిమితమైన ఈ క్రీడ.. ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం విస్తరిస్తోంది. అయితే క్రికెట్ ఈ స్థాయిలో విస్తరించడానికి.. ఈ స్థాయిలో ఆదరణ సాధించడానికి ప్రధాన కారణం తీసుకొచ్చిన మార్పులే. క్రికెట్లో అలా తీసుకొచ్చిన మార్పులలో ప్రధానమైనది పవర్ ప్లే. పవర్ ప్లే అనేది t20, వన్డేలలో కొనసాగుతోంది. పవర్ ప్లే నిబంధన క్రికెట్ లోకి తీసుకురావడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది.

Also Read: వాషింగ్టన్ సుందర్ సిక్సర్ల హోరు.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాటల జోరు.. అదిరింది పో..

1979 నవంబర్ 28న బెన్సన్ అండ్ ఎడ్జస్ వరల్డ్ సిరీస్ కప్ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిడ్నీ వేదికగా తరపడుతున్నాయి. వెస్టిండీస్ మ్యాచ్లో గెలవడానికి మూడు పరుగులు కావాలి. అది కూడా చివరి బంతిలో మాత్రమే చేయాలి. నాడు ఇంగ్లాండ్ జట్టు తరఫున ఇయాన్ బోథమ్ బౌలింగ్ చేస్తున్నాడు.. ఈ దశలో ఇంగ్లాండ్ కెప్టెన్ మైక్ బ్లర్రి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన జట్టు గెలవాలని.. ఫీల్డర్లందరినీ బౌండరీ రోప్ వద్ద నియమించాడు. అందరు ప్లేయర్లు 30 యార్డు సర్కిల్ అవతల ఫీల్డింగ్ చేశారు. నాడు ఫీల్డింగ్ విషయంలో ఎటువంటి పరిమితులు లేవు. నిబంధనలు కూడా లేవు. దీంతో బ్రిటిష్ జట్టు కెప్టెన్ తీసుకొని నిర్ణయం సత్ఫలితాన్ని ఇచ్చింది.. చివరి బంతికి వెస్టిండీస్ ఆటగాడు అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read:  పాకిస్తాన్ ను చితక్కొట్టిన సౌతాఫ్రికా .. తీరని కల నెరవేర్చిన డివిలీయర్స్

విజయం సాధించినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వచ్చాయి.. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఫీల్డింగ్ నియమించారంటూ విశ్లేషకులు మండిపడ్డారు. ఇక అప్పటినుంచి అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య వన్డే ఫార్మాట్ నియమాలను పూర్తిగా మార్చింది.. అప్పట్లో దీనిని ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్ అని పిలిచేవారు. కాలానుగుణంగా 2005లో “పవర్ ప్లే” ను అందుబాటులోకి తీసుకొచ్చారు.. పవర్ ప్లే తర్వాత, ఇంకా రకరకాల నిబంధనలను అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రికెట్ మొత్తాన్ని సమూలంగా మార్చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version