Asia Cup 2025 Team: శస్త్ర చికిత్స చేయించుకొని.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో తర్ఫీదు పొంది.. మొత్తానికి ఆసియా కప్ కు సిద్ధమయ్యాడు సూర్య కుమార్ యాదవ్. ఈ సిరీస్లో టీమిండియా కు అతడే సారధ్యం వహిస్తాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగుతుంది. గత ఏడాది టి20 విధానంలో ఈ టోర్నీ నిర్వహించిన నేపథ్యంలో.. ఈసారి కూడా అదే విధానంలో టోర్నీ నిర్వహిస్తారని తెలుస్తోంది.
Also Read: సెప్టెంబర్ నుంచి ఆసియా కప్.. వేదిక మార్పు.. భారత్, పాకిస్తాన్ తలపడేది అప్పుడే?
ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీం ఇండియాను ముందుండి నడిపించాడు గిల్. వాస్తవానికి ఆంగ్ల జట్టుతో జరిగిన సిరీస్ లో అడుగు పెట్టే నాటికి గిల్ రికార్డు అంత గొప్పగా లేదు. కానీ ఈ సిరీస్లో ఆకలిగా ఉన్న సింహం లాగా అతడు పరుగుల దాహం తీర్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై పదేపదే దాడి చేస్తూ తాను ఎంత స్పెషలో నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుకు సిరీస్ దూరం చేసి.. టీమిండియా పరువు కాపాడాడు గిల్. దీంతో అక్కడికి పరిమిత ఓవర్లలో ప్రమోషన్ లభిస్తుందని.. ఆసియా కప్ కు సారథ్యం వహించే బాధ్యత దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ జాతీయ మీడియాలో ఇందుకు వ్యతిరేకంగా వార్త కథనాలు ప్రసారమవుతున్నాయి.
Also Read: టెలికాం కంపెనీల మధ్య పోరు 2025లో మళ్లీ ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందా?
ఆసియా కప్ లో టీమిండియా కు సూర్య కుమార్ యాదవ్ సారథ్యం వహిస్తాడని తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే మంగళవారం భారత జట్టును ప్రకటించే కార్యక్రమానికి సూర్య కుమార్ యాదవ్ హాజరయ్యాడు. ముంబైలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో భారత జట్టు ఎంపిక సంబంధించిన వివరాలను శిక్షకుడు గౌతమ్ గంభీర్, సారధి సూర్య కుమార్ యాదవ్ వెల్లడిస్తారు. సూర్య కుమార్ యాదవ్ ఈ టోర్నీకి సారథ్యం వహించడం ఖాయమైన నేపథ్యంలో.. గిల్ కు చోటు లభిస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు ఆడతాడు అని చెబుతుండగా.. మరికొన్ని మీడియా సంస్థలు అతనికి అవకాశం లేదని అంటున్నాయి. టి20 ఫార్మేట్ లో గిల్ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటం వల్లే అతడిని ఆడించడం లేదని తెలుస్తోంది. ఇటీవలి ఫామ్ ను పరిగణలోకి తీసుకుంటే మాత్రం అతడికి జట్టులో అవకాశం లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ , అభిషేక్ శర్మ వంటి వారికి చోటు దక్కుతుందా? ఈ ప్రశ్నకు మరికొద్ది క్షణాలలోనే సమాధానం లభించనుంది.