Bolisetti Srinivas Remarks: ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. మరో 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బలంగా ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధితోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు కూటమి అనివార్యమని చెబుతున్నారు. అయితే ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేస్తుండడంతో జనసైనికులు సైతం సైలెంట్ అవుతున్నారు. కూటమి గానే సర్దుబాటు చేసుకునేందుకు అయిష్టంగానే ముందుకు వెళ్తున్నారు. అయితే కొందరు జనసేన ఎమ్మెల్యేలు మాత్రం కూటమి ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తరచూ వారు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ టిడిపిని తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ ను పొగుడుతూనే.. మరోవైపు టిడిపి చర్యలను తప్పుపట్టారు.
Also Read: ఇప్పటికీ అదే క్రేజ్.. వంగవీటి మోహన్ రంగా స్పెషల్ అదే!
కాపుల్లో చెరగని ముద్ర..
కాపు నాయకుడిగా ముద్రపడ్డారు వంగవీటి మోహన్ రంగా. 1988లో ఆయన దారుణ హత్యకు గురయ్యారు. ప్రజా సమస్యలపై రోడ్డుపై నిరాహార దీక్ష చేస్తున్న రంగాపై కొంతమంది దుండగులు దాడి చేసి హత్య చేశారు. అప్పట్లో ఇది సంచలనం గా మారింది. తెలుగు రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపింది. 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయేందుకు దోహదపడింది. అయితే రంగా మరణించి మూడున్నర దశాబ్దాలు అవుతున్నా ఆయన పేరును మాత్రం చెరపలేకపోతున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. ఆయన హత్య వెనుక అప్పటి టిడిపి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. కానీ అటు తరువాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ విషయంలో నిగ్గు తేల్చలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మోహన్ రంగా హత్యను ఆ పార్టీ సైతం పక్కన పడేయడం అప్పట్లో పెను సంచలనమే.
Also Read: పవన్ ను సీఎం చేయాలి.. కాపులంతా ఏకతాటిపైకి.. తెరపైకి వంగవీటి రంగా హత్య ఇష్యూ
నాటి ప్రభుత్వమే చేయించింది..
అయితే తాజాగా వంగవీటి మోహన్ రంగా హత్య పై మాట్లాడారు బొలిశెట్టి శ్రీనివాస్. వంగవీటి మోహన్ రంగా ను అప్పటి ప్రభుత్వం ద్వారా హత్య చేయించారని ఆరోపించారు. అప్పట్లో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రస్తుతం టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉంది. ఒక కూటమి ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ ఆ వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పెట్టారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తించారు. అయితే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ విధంగా మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. చాలా సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ విషయంలో కూడా ఇలానే స్పందించారు. అయితే ఈయన జనసేనలో పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి ఆయన దూకుడుకు కళ్లెం వేస్తారో? లేదో? చూడాలి.