Temba Bavuma: 2023 వరల్డ్ కప్ లో భాగంగా పది దేశాల టీముల కెప్టెన్లతో ఒక మీటింగ్ ని అరేంజ్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా 2019 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ టీం ని విజేతగా నిలిపిన ఇయాన్ మోర్గాన్ రావడం జరిగింది. ఇంకా ఈ ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా రవి శాస్త్రి వ్యవహరించడం జరిగింది. ఈ మీటింగ్ లో 10 దేశాలకు సంబంధించిన టీం కెప్టెన్లు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. ఇక అందులో భాగంగానే రవి శాస్త్రి అందరితో మాట్లాడుతూ కెప్టెన్లు అందరూ కూడా వరల్డ్ కప్ మ్యాచ్ లకి సంబంధించిన వివరాలను తెలుసుకున్నాడు.
ఏ టీమ్ ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తుంది అని అడుగుతూ కెప్టెన్ల దగ్గర వాళ్ళ టీం ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు.ఇక ఇందులో భాగంగానే సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ అయిన బావుమా డిస్కషన్ మధ్యలో టైం దొరికిందని ఒక చిన్న పాటి కునుకు తీశాడు.దాంతో అది కెమెరా కంటికి చిక్కింది. నిజానికి భావుమా గతవారం మొత్తం ప్రయాణ లతోనే గడిపినట్టుగా తెలుస్తుంది.ఇక సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి చేరుకున్న బావుమా కొన్ని పర్సనల్ పనుల వల్ల మళ్ళీ సౌత్ ఆఫ్రికా కు వెళ్లి రెండు రోజుల క్రితమే ఇండియా చేరుకోవడం జరిగింది. దానివల్లే అలసిపోయిన భావుమా సమయం దొరికింది కదా అని స్టేజ్ పైన చిన్నపాటి కునుకు తీశాడు మొత్తానికి అది కెమెరాకి చిక్కడం వల్ల ఆ పిక్స్ నెట్లో తెగ వైరల్ గా మారింది…
ఇక మరికొద్ది గంటల్లో 2019 వరల్డ్ కప్ ఫైనల్లో ఆడిన టీమ్ లు అయిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ జరగనుంది. గత వరల్డ్ కప్ లో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండ్ రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ వేదికగా మొదటి మ్యాచ్ జరగబోతుంది ఇక ఇది క్రికెట్ అభిమానులందరికీ మంచి ఉత్సాహాన్ని నింపే విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు జట్లు కూడా చాలావరకు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇందులో ఏ టీం ని ఏ టీమ్ ఓడిస్తుంది అనేది మనం కచ్చితంగా చెప్పలేం… అందుకోసమని వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ గెలిచి బోణీ కొట్టే జట్టు ఏంటి అనేది తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు కూడా చాలా ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు…
ఇక ఈ క్రమంలో ఇండియా మొదటి మ్యాచ్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో ఆడనుంది ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే 11వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ తో మరో మ్యాచ్ ఆడుతుంది. అలాగే అక్టోబర్ 14 వ తేదీన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో తలపడనుంది.ఇక ఈ మ్యాచ్ మీద ఇండియా పాకిస్తాన్ అభిమానులే కాకుండా ప్రపంచ క్రికెట్ అభిమానులు కూడా అత్యంత ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది…
Temba Bavuma isn't sleeping he is just looking down.
See this video.
Stop making fun of him for no reason. pic.twitter.com/p78oqKTiWC— Yash Jain (@yashjain4163) October 4, 2023