https://oktelugu.com/

Cricket : మూడు నెలలు ఆటలు బంద్.. మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఎప్పుడంటే?

. జూన్ 1 నుంచి టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అదే నెల 29 వరకు ఈ పోరు సాగనుంది. ఆ తరువాత ఇండియా, జింబాబ్వే టోర్నీ సాగనుంది. ఇది టీ 20 మ్యాచ్. అయితే ఈ మ్యాచ్ కు భారత్ నుంచి ద్వితీ శ్రేణి జట్టు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

Written By: , Updated On : March 11, 2024 / 04:56 PM IST
India Cricket Team

India Cricket Team

Follow us on

Cricket :  వరుస టోర్నీలతో బిజీ అయిన టీమిండియాకు మూడు నెలల పాటు విశ్రాంతి దొరికింది. ఇంగ్లండ్ తో జరిగిన టోర్నీలో 4-1 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే నెక్ట్స్ టోర్నమెంట్ ఎప్పుడు? అని క్రీడాభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో అనధికారికంగా కొంత సమాచారం బయటకు వచ్చింది. వచ్చే జూన్ లో టీమిండియా టీ 20 వరల్డ్ కప్ తో ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో అప్పటి నుంచి రసవత్తరంగా పోరు సాగనుంది.

2024 టీ20 వరల్డ్ కప్ సీజన్ లో భాగంగా టీమిండియా జూన్ 5న ఐర్లాండ్ తో బరిలోకి దిగనుంది. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొన్ని మ్యాచ్ లు మాత్రమే ఆడనున్నారు. అయితే ఈ మధ్యలో ఐపీఎల్ బరిలోకి దిగుతారు. కానీ టీమిండియా ఆటగాళ్లు అంతా ఒక్క చోట కాకుండా ఎవరికి వారు విడిపోయి వివిధ జట్లలో తమ ప్రతిభను నిరూపిస్తారు. ఈ ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ తో ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది.

ఏప్రిల్ , మే నెలలో ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ లు లేవు. కానీ మే చివర్లో పాకిస్తాన్ జట్టు, ఇంగ్లండ్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్ పోరు ప్రారంభం అవుతుంది. జూన్ 1 నుంచి టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అదే నెల 29 వరకు ఈ పోరు సాగనుంది. ఆ తరువాత ఇండియా, జింబాబ్వే టోర్నీ సాగనుంది. ఇది టీ 20 మ్యాచ్. అయితే ఈ మ్యాచ్ కు భారత్ నుంచి ద్వితీ శ్రేణి జట్టు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.