Cricket Fans
Cricket Fans : ఇక క్రికెట్ ఫ్యాన్సులో కొంతమంది అభిమానం విచిత్రంగా ఉంటుంది. వారు ప్రతి మ్యాచ్ కూడా నేరుగా మైదానంలోకి వెళ్లి చూస్తారు. తన అభిమాన ఆటగాళ్లను దగ్గరుండి చూస్తారు. వారు ఆడుతుంటే ఆనందపడతారు. వారు విఫలమైతే బాధపడుతుంటారు. కానీ లైవ్ క్రికెట్ చూడటం మాత్రం అసలు వదిలిపెట్టరు.. అలాంటి జాబితాలో ఇతడు కూడా ఒకడు. కాకపోతే అతడు వృత్తిరీత్యా కెమెరామెన్. అదృష్టం కొద్దీ అతడికి మ్యాచ్ ను షూట్ చేసే ఉద్యోగం లభించింది. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా అతడు నెరవేర్చుకున్నాడు. ప్రపంచంలో ఏ క్రికెట్ అభిమాని సాధించలేని ఆనందాన్ని అతడు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు తాను సాధించిన ఘనతను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది.
Also Read : యంగ్ టైగర్ తో యంగ్ క్రికెటర్స్… తారక్ ని కలిసిన టీం ఇండియా, ఫోటోలు వైరల్!
అందరి ఆటోగ్రాఫ్ లతో..
అతని పేరు తెలియదు కానీ.. క్రికెట్ అంటే మాత్రం అతడికి చాలా ఇష్టం. ఫోటోగ్రఫీ కూడా అంటే ప్రాణం. అందువల్లే అతడు క్రికెట్ మ్యాచ్లను షూట్ చేసే ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాడు. తన ఉద్యోగరీత్యా క్రికెట్ మ్యాచ్లను అతడు షూట్ చేస్తాడు. అభిమాన ఆటగాళ్లు ఆడుతుంటే దగ్గరుండి చూస్తాడు. పనిలో పనిగా వారితో ఫోటోలు కూడా దిగుతుంటాడు. అయితే తన అభిమానాన్ని చాటుకోవడానికి ఇంకా కొత్తగా ఏదైనా చేయాలని అతడు అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఒక బ్యాట్ కొనుగోలు చేసి.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం ఆటగాళ్ల ఆటోగ్రాఫ్లను తీసుకోవాలని అనుకున్నాడు. అనుకున్నది తడవుగా.. ఆ బ్యాట్ మీద టీం ఇండియా ఆటగాళ్ల ఆటోగ్రాఫ్లను అతడు తీసుకున్నాడు. అంతేకాదు తన బ్యాట్ పై తన అభిమాన ఆటగాళ్ల ఆటోగ్రాఫ్లను చూపిస్తూ వీడియో తీశాడు.. “ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. టీ మీడియాలో అద్భుతమైన ఆటగాళ్ల ఆటోగ్రాఫ్లు మొత్తం ఈ బ్యాట్ మీద ఉన్నాయి. ఆ ఆటోగ్రాఫ్ లు చూసినప్పుడల్లా అభిమానిగా నా మనసు పులకరించిపోతుంది. ఉద్వేగంతో రోమాలు నిక్కబొడుస్తాయి. క్రికెట్ పై అభిమానాన్ని మరింత పెంచేలా చేస్తాయి. ఇంత ఆనందాన్ని కలిగించిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ” అతడు ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోని చూసిన వారంతా అత్యంత అదృష్టవంతుడైన క్రికెట్ అభిమాని అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ” అతడు ప్రొఫెషనల్ కెమెరామెన్. మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సులభంగానే అవకాశం లభిస్తుంది. ప్లేయర్లు కూడా అతడిని సులభంగానే గుర్తుపడతారు. అందువల్లే ఆటోగ్రాఫ్లు ఇచ్చి ఉంటారు. సాధారణ ప్రేక్షకులు గనుక మైదానంలోకి అడుగు పెడితే సెక్యూరిటీ సిబ్బంది బయటకు లాక్కుని వెళ్తారు. ఆ తర్వాత బడిత పూజ చేస్తారు. గత ఏడాది నిర్వహించిన ఐపిఎల్ లో ఈ తరహా సంఘటనలు చాలా జరిగాయని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : మ్యాచ్‌కో కెప్టెన్.. టూర్‌కో కోచ్.. అభాసు పాలవుతున్న బీసీసీఐ