BCCI- Indian Cricket Team: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గుర్తింపు ఉంది. ప్రపంచ క్రికెటనే శాసించగల స్థాయిలో ఉన్న బీసీసీఐ కొంత కాలం నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు.. సెలక్షన్ కమిటీ ఎంపిక తీరుతో అభాసుపాలవుతోంది. బీసీసీఐ సెలక్షన్‌కమిటీ చైర్మన్‌గా భారత జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ చేతన్ శర్మ చైర్మన్‌గా ఉన్నాడు. మిగతా సెలక్టర్లతో ఎడా పెడా జట్టును ఎంపిక చేయడంలో కంటే ఎక్కువగా మార్పులు చేర్పులు చేస్తున్నది కేవలం కెప్టెన్సీనే. ఎవరైనా ఆటలో ప్రతిభ కనబరిస్తే ఎంపిక చేస్తారు. ప్రొఫెషనలిజం లేకుండా పోయింది. రాజకీయాలు ఇందులో చోటు చేసుకోవడం వల్లే ఇలా జరుగుతోందంటూ విమర్శలు ఉన్నాయి. గత రెండేళ్లుగా తన ఆటతీరుతో పూర్తిగా నిరాశ పరుస్తూ వచ్చాడు విరాట్ కోహ్లీ. కానీ అతడిని ఎంపిక చేయడంపై మండి పడ్డారు భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.
BCCI- Indian Cricket Team
ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లు..
విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ భారత జట్టు కెప్టెన్ పదవి నుంచి 2021లో తప్పుకున్నారు. ఆ తర్వాత ఏడుగురిని మార్చింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ , కేఎల్ రాహుల్ , హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్..ఇలా చెప్పుకుంటూ పోతే మార్చుకుంటూ వెళుతోంది. ఎవరూ భారత జట్టుకు పర్మినెంట్ గా కెప్టెన్ ఇంత వరకు లేక పోవడం దారుణం. జింబాబ్వే టూర్ కు ఇప్పటికే కెప్టెన్‌గా శిఖర్ ధావన్ మొదట ఎంపిక చేసింది బీసీసీఐ. తాజాగా శిఖర్ ధావన్ ను తప్పించి కేఎల్ రాహుల్ కు నాయకత్వం అప్పగించింది. దీంతో ప్రస్తుతం భారత జట్టు నాయకత్వం ఓ జోక్‌గా మారిందన విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: Mahesh-Trivikram Movie: మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా ప్రముఖ స్టార్ హీరో..షాక్ లో ఫాన్స్
భారత క్రికెట్ మాజీ సెలక్టర్ సబా కరీం సీరియస్ కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుసరిస్తున్న తీరు పట్ల, సెలక్టర్ల నిర్ణయాలపై భగ్గుమన్నాడు. జింబాబ్వేలో పర్యటించే వన్డే సీరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. ఇప్పటికే కెప్టెన్ గా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను డిక్లేర్ చేసింది బీసీసీఐ. కానీ ఉన్నట్టుండి గాయం కారణంగా ఆడలేక పోయిన కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో శిఖర్ ధావన్ ను తప్పించింది. అతడి స్థానంలో కేఎల్‌ఆర్ కు ఇచ్చింది. ఆపై డిప్యూటీ కెప్టెన్ గా డిమోషన్ ఇచ్చింది. దీనిపై నిప్పులు చెరిగాడు సబా కరీం. అసలు బీసీసీఐలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నాడు. వరల్డ్ వైడ్ గా ఏ దేశ క్రికెట్ బోర్డు ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకోవడం లేదని మండిపడ్డాడు. ఇప్పటి వరకు ఎనిమిది మందిని కెప్టెన్లుగా మార్చారంటూ గుర్తు చేశాడు.
BCCI- Indian Cricket Team
ఆటగాళ్ల మానసిక స్థైర్యంపై ప్రభావం..
క్రెకెటర్ల ఎంపిక విషంయలో బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలు ఆటగాళ్ల మానసిక స్థితిపనై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నాడు కరీం. నాయకత్వ పరంగా చూస్తే కేఎల్ రాహుల్ కంటే శిఖర్ ధావన్ ట్రాక్ రికార్డ్ బాగుందుని గుర్తు చేశాడు. వన్డే సిరీస్ కు ఎంపిక చేసి ఆ తర్వాత ఇలాంటి చెత్త నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ నేరుగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మను ప్రశ్నించారు.
తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్.లక్ష్మణ్.
కెప్టెన్సీ మార్పుపై ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతుండగానే బీసీసీఐ మరో నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే వెళ్లే జట్టుకు కోచ్‌గా క్రికెట్ అకాడెమీ డైరెక్టర్ గా ఉన్న మాజీ క్రికెటర్ వీవీఎస్.లక్ష్మణను నియమించింది. ఇక ఆసియా కప్ లో పాల్గొనే జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉంటారని ప్రకటించింది. మొత్తంగా ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియని పరిస్థితి నెలకొంది.