Amravati capital
Amravati capital : అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పునర్నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభించాలని నిర్ణయించింది. అటు క్యాబినెట్ సబ్ కమిటీ సైతం కీలక సూచనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి రాజధాని నిర్మాణానికి సాయం ప్రకటించింది. కీలక రవాణా, రైల్వే ప్రాజెక్టులను సైతం మంజూరు చేసింది. ప్రపంచం గుర్తించదగ్గ రాజధానుల్లో అమరావతిని చేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఈ నెల 15న అమరావతి పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వెంకటపాలెం లో గల శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం జరగనుంది. సీఎం చంద్రబాబు తో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు.
Also Read : అమరావతి పునర్నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే పనులు!
* 2018లో ఆలయ నిర్మాణం
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ). అమరావతిని రాజధానిగా ప్రకటించింది. 2018లో సీఎం చంద్రబాబు వెంకటపాలెంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2019లో శంకుస్థాపన కూడా చేశారు. అటు తరువాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసింది. కానీ ఈ ఆలయ నిర్మాణాన్ని మాత్రం పూర్తి చేసింది. 2022లో వైభవంగా ప్రారంభించారు ఈ ఆలయాన్ని. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
* అధికారుల సమీక్ష వెంకటపాలెం( venkatapalam ) శ్రీవారి ఆలయంలో.. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని టీటీడీ కార్యనిర్వాహణ అధికారి శ్యామలరావు సమీక్ష చేశారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. శ్రీనివాస కళ్యాణం పై అమరావతి గ్రామాల్లో టీటీడీ ప్రచార రథం పై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి అవకాశం ఉండడంతో.. ఆలయ ప్రాంగణంలో గ్యాలరీలు, క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను గుర్తించామని.. పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా వాహనాలను ఎక్కడ నిలపాలనే విషయాన్ని భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలిపారు. మొత్తానికైతే అమరావతిలో భారీ ఈవెంట్ కు ప్లాన్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
Also Read : బొత్స స్మశానం కామెంట్స్.. అమరావతి రైతు ఫిర్యాదు!