spot_img
Homeక్రీడలుక్రికెట్‌Cooper super batting performance: కూపర్ సూపర్ బ్యాటింగ్ వెనుక అతడు.. ఇది ఎవరూ ఊహించలేదు

Cooper super batting performance: కూపర్ సూపర్ బ్యాటింగ్ వెనుక అతడు.. ఇది ఎవరూ ఊహించలేదు

Cooper super batting performance: ఐపీఎల్ లో మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు మీద ఢిల్లీ ఆటగాడు కూపర్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు..72* పరుగులు చేసి.. పంజాబ్ జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు.. తద్వారా పంజాబ్ జట్టు కు ట్రోఫీ మీద ఆశలు కల్పించాడు. కూపర్ ఓపెనర్ గా వచ్చి.. చివరి వరకు నాట్ అవుట్ గా నిలిచి.. ఆడటం పట్ల ప్రశంసలు లభిస్తున్నాయి..

ఆస్ట్రేలియా దేశానికి చెందిన కూపర్.. అక్కడి అండర్ 19 జట్టు ద్వారా వెలుగులోకి వచ్చాడు. బ్యాటింగ్ చేయగలడు.. అదే సమయంలో బంతితో మాయాజాలాన్ని సృష్టించగలడు. ఆస్ట్రేలియా జట్టు తరఫున 11 t20 లు.. 8 వన్డేలు ఆడాడు. చివరికి సుదీర్ఘ ఫార్మాట్లో కూడా ప్రవేశించాడు. గత ఏడాది చివరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ అతడిని మూడు కోట్లకు కొనుగోలు చేసింది.. గతంలో పంజాబ్ జట్టులో ఇంగ్లిస్ ఉండేవాడు. అతడి స్థానంలో కూపర్ ను పంజాబ్ మేనేజ్మెంట్ కొనుగోలు చేసింది..

కూపర్ ను కొనుగోలు చేయడం వెనక రికీ పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు.. కూపర్ ఇంతవరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో చెప్పుకునే స్థాయిలో ప్రదర్శన చేయలేదు. బిగ్ బాష్ లీగ్ లో మాత్రం అదరగొట్టాడు. ఇప్పటి వరకూ 34 మ్యాచ్ లు ఆడిన కూపర్.. 786 పరుగులు చేశాడు. బౌలింగ్ లో కూడా సత్తా చూపించాడు. 6.85 ఎకానమీతో 27 వికెట్లను పడగొట్టాడు. గతంలో ఆస్ట్రేలియా జట్టులో షాన్ మార్ష్ కూడా ఇదే స్థాయిలో ఆడేవాడు. ఇప్పుడు కూపర్ అతడిని మరిపిస్తున్నాడు. తద్వారా అతని మీద ప్రశంసల జల్లు కురుస్తుంది. మార్ష్ కూడా ఐపీఎల్ లో పంజాబ్ తరఫున చాలా మ్యాచులు ఆడాడు. గుజరాత్ జట్టులో రషీద్ ఖాన్ కీలకమైన బౌలర్. అతడు అత్యంత ప్రమాదకరమైన స్పిన్నర్ కూడా. అతడిని కూపర్ అత్యంత సులువుగా ఎదుర్కొన్నాడు. రషీద్ వేసిన 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 5 సిక్సర్లు ఉన్నాయి. ఒకవేళ అతడు గనుక ఇదే స్థాయిలో ఆట తీర్ ప్రదర్శిస్తే పంజాబ్ జట్టుకు ఈ ఐపీఎల్లో తిరుగు ఉండదని అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు అయ్యర్ స్థానంలో కూపర్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను అయ్యర్ ఖండించాడు. ప్రస్తుతానికి అలాంటి ప్రయోగం లేదని అతడు స్పష్టం చేశాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version