spot_img
Homeక్రీడలుక్రికెట్‌Glenn Maxwell central contract dropped: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఔట్.. ఈ ఆటగాడి ఖేల్...

Glenn Maxwell central contract dropped: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఔట్.. ఈ ఆటగాడి ఖేల్ ఖతం

Glenn Maxwell central contract dropped: 2023 వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్.. ఆఫ్ఘనిస్తాన్ తో ఆస్ట్రేలియా ఆడుతోంది.. నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు వరుసగా విఫలమయ్యారు. చివరికి మాక్స్ వెల్ రంగంలోకి దిగాడు. ఒక్కడే జట్టు భారాన్ని మొత్తం మోసాడు. కొండంత లక్ష్యాన్ని చేదించాడు. ఒక రకంగా సంజీవ పర్వతాన్ని మోసిన ఆంజనేయుడు మాదిరిగా.. అతడు సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అంతేకాదు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా పై ఘనవిజయం సాధించి.. ట్రోఫీని అందుకుంది.. నాడు ఆఫ్ఘనిస్తాన్ పై అద్భుతమైన బ్యాటింగ్ చేసిన మాక్స్ వెల్ ఒక్కసారిగా సూపర్ హీరో అయిపోయాడు. ఆస్ట్రేలియా జట్టు మేనేజ్మెంట్ అతడికి అప్పట్నుంచి క్రమం తప్పకుండా అవకాశాలు ఇస్తోంది.

అదృష్టమో.. దురదృష్టమో తెలియదు గాని మాక్స్ వెల్ అప్పటినుంచి సరిగ్గా ఆడటం లేదు . చివరికి ఐపీఎల్ లో కూడా దారుణమైన ప్రదర్శన చేయడంతో అవకాశాన్ని కోల్పోయాడు. జాతీయ జట్టులో అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతడిని పక్కన పెట్టింది. 2026, 27 సీజన్లో 21 మంది ప్లేయర్లకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అవకాశం కల్పించింది. ఇందులో మాక్స్ వెల్ కు చోటు లభించలేదు. అతడిని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఏ కేటగిరీలో కూడా తీసుకోలేదు. మాక్స్ వెల్ 2017 లో చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాడు.. అయితే వచ్చే సీజన్లో ఎక్కువ సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచులు ఆడే వారికి మాత్రమే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సెంటర్ కాంట్రాక్టు ఇవ్వడం విశేషం.

ఆస్ట్రేలియా జట్టు త్వరలో భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లతో టెస్ట్ సిరీస్ లు ఆడనుంది.. టెస్ట్ లలో ప్రాధాన్యం లభించకపోవడంతో మాక్స్ వెల్ ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం టి20 లలో మాత్రమే కొనసాగుతున్నాడు. టి20 వరల్డ్ కప్ లో కూడా అతడు పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. మరో రెండు సంవత్సరాలలో టి20 వరల్డ్ కప్ వస్తుంది. దానికంటే ముందుగానే ఆస్ట్రేలియా ప్రణాళికలను మొదలుపెట్టింది. ప్రక్షాళనలో భాగంగా మాక్స్ వెల్ ను మొహమాట లేకుండా దూరం పెట్టింది. దీంతో అతడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని వార్తలు వస్తున్నాయి.

ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు లిస్టును చూస్తే.. టెస్ట్ ఫార్మాట్ కు విపరీతమైన ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మాక్స్ వెల్ మాత్రమే కాదు.. ఉస్మాన్ ఖావజాకు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కలేదు.. 2024లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగినప్పుడు అదరగొట్టిన కోన స్టాస్ కు సెంట్రల్ కాంట్రాక్టులో అవకాశం లభించలేదు.

చోటు లభించిన ఆటగాళ్లు మీరే

ఆడం జంప, బార్ట్ లెట్, స్కాట్, క్యారీ, బ్యూ వెబ్ స్టర్, కమిన్స్, డగెట్, ఎలిస్, గ్రీన్, జేక్ వెదర్ ల్యాండ్, హేజిల్ వుడ్, హెడ్, ఇంగ్లిస్, కున్హేమన్, లబు షేన్, లయన్, మార్ష్, మార్పీ, నేసెర్, స్మిత్, స్టార్క్.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version